ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@5 PM - telugu news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA LATEST TOP NEWS
TELANGANA LATEST TOP NEWS
author img

By

Published : Apr 8, 2021, 4:58 PM IST

Updated : Apr 8, 2021, 5:08 PM IST

నిరాడంబరంగానే ఉగాది వేడుకలు..

కరోనా వ్యాప్తి దృష్ట్యా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రతి గ్రామానికీ టీ-ఫైబర్​ సేవలు!

బ్రాడ్ బ్యాండ్ సౌకర్యాన్ని ఒక యుటిలిటీగా పరిగణించి.. పట్టణాల్లోని ప్రతి ఇంటికీ అనుసంధానించే విధానాన్ని అధ్యయనం చేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అధికారులకు ఆదేశించారు. మిషన్ భగీరథ పనులు పూర్తైన గ్రామీణ ప్రాంతాల్లో టీ- ఫైబర్ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఆగస్టు నాటికి ప్రతీ గ్రామానికి టీ-ఫైబర్ కనెక్టివిటీ ఇచ్చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హనుమంతుడు పుట్టింది.. తిరుమలగిరులలోనే..!

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుమ‌ల క్షేత్రం ఇకపై హ‌నుమంతుని జ‌న్మ‌స్థానంగానూ గుర్తింపు పొంద‌నుంది. ఏప్రిల్ 13న తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది రోజున ఈ విష‌యాన్ని పురాణాలు, శాస‌నాలు, శాస్త్రీయ‌ ఆధారాల‌తో స‌హా నిరూపించేందుకు ‌తితిదే సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గురు తేగ్​ బహదూర్​పై మోదీ

గురు తేగ్​ బహదూర్​ ప్రభావం లేకుండా నాలుగు శతాబ్దాలలో భారత్​ చరిత్రను ఊహించలేమని ప్రధాని మోదీ అన్నారు. ఆయన నేర్పిన పాఠాలు, సిక్కు గురు సంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి షాక్

సీబీఐ విచారణను సవాలు చేస్తూ మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ దాఖలు చేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దేశ్​ముఖ్​పై వచ్చిన ఆరోపణల స్వభావాన్ని బట్టి.. ఆయనపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వ్యాక్సినేషన్​పై నిపుణుల సూచనలు

దేశంలో టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు అన్ని వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని కేంద్రానికి వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్ బాధ్యతలను వైద్య కళాశాలలకు అప్పగించాలని చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పెరిగిన బంగారం, వెండి ధరలు

దేశీయంగా పసిడి, వెండి ధరలు గురువారం మరింత పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.180కి పైగా ఎగబాకింది. వెండి ధర కిలో రూ.66 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మార్కెట్లకు స్వల్ప లాభాలు

ఆరంభంలో భారీగా పుంజుకున్న స్టాక్ మార్కెట్లు.. చివరకు స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. సెన్సెక్స్ 84 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 55 పాయింట్లు పుంజుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆర్సీబీ కొత్త కుర్రాళ్లతో కోహ్లీ

మరికొన్ని గంటల్లో ఐపీఎల్​ మొదలుకానున్న నేపథ్యంలో ఆర్సీబీ సభ్యులతో కెప్టెన్ కోహ్లీ ముచ్చటించాడు. ఈసారి మనమంతా కచ్చితమైన నమ్మకంతో ఉంటే అద్భుతాలు సృష్టిస్తామని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వకీల్​సాబ్​పై చిరు ట్వీట్​

పవన్​కల్యాణ్​ 'వకీల్​సాబ్'​ చిత్రాన్ని చూసేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు మెగాస్టార్​ చిరంజీవి. శుక్రవారం తన తల్లి, కుటుంబసభ్యులతో కలిసి థియేటర్​లో సినిమా చూడబోతున్నట్లు ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Apr 8, 2021, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.