ETV Bharat / city

TS Top News: టాప్​న్యూస్​@9AM - TOPNEWS

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TELANGANA LATEST TOP EWS
TELANGANA LATEST TOP EWS
author img

By

Published : Mar 6, 2022, 8:58 AM IST

  • 'రష్యాను యుద్ధం ఆపమనండి'..

Ukraine Russia War: తమ దేశంపై చేస్తున్న దాడులకు రష్యా ముగింపు పలికేలా భారత్​ చొరవ తీసుకోవాలని ఉక్రెయిన్​ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు. విదేశీ విద్యార్థులను, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జరిపిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘిస్తోందని ఆరోపించారు.

  • 'బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం'

kherson city people problems: ఉక్రెయిన్​లోని ఖేర్సన్ నగరం రష్యా ఆధీనంలోకి వెళ్లిపోవడం వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొెంటున్నారు. బయటకు కదలలేని పరిస్థితుల్లో ఉన్నామని ఉక్రెయిన్​కు చెందిన యులియా అనే యువతి ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి భయానక పరిస్థితుల గురించి ఆమె 'ఈనాడు'తో మాట్లాడారు.

  • 'రష్యా చేతిలో బందీగా 4లక్షల ఉక్రెనియన్లు'

Russia Ukraine war: ఉక్రెయిన్​పై రష్యా సైనిక చర్య పదకొండు రోజులుగా కొనసాగుతోంది. క్షిపణులు, బాంబుల మోతతో ఉక్రెయిన్​ దద్ధరిల్లుతోంది. మరోవైపు.. తమ దేశానికి మద్దతుగా నిలవాలని ఉక్రెయిన్​ అధ్యక్షుడు జెలెన్​స్కీ కోరుతున్నారు. మరోమారు అమెరికా అధ్యక్షుడు బైడెన్​తో మాట్లాడి.. సాయం అందించాలని కోరారు. ఇరు దేశాల మధ్య మూడో దఫా చర్చలు సోమవారం జరగనున్నాయి. మరోవైపు.. రష్యాపై ఆంక్షల పర్వం కొనసాగుతోంది. వీసా, మాస్టర్​కార్డు, పూమా వంటి సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

  • ఒక్కొక్కరికి ఉచితంగా 30 పరీక్షలు..

Telangana Health profile: ఆరోగ్యరంగంలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యంతో...... రాష్ట్రప్రభుత్వం ఈ- హెల్త్‌ ప్రోఫైల్‌కి శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు పైబడిన ప్రజల పూర్తి ఆరోగ్య సమాచారం సేకరించే ప్రక్రియ ప్రయోగాత్మకంగా ములుగు, సిరిసిల్ల జిల్లాలో ప్రారంభమైంది. సుమారు 220 బృందాలు క్షేత్రస్థాయిలో వెళ్లి వివరాలు సేకరించి.. డిజిటల్‌ హెల్త్‌ కార్డ్ రూపొందించనున్నారు..

  • భారీ బడ్జెట్​ సిద్ధం...

Telangana Budget 2022: సంక్షేమ, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేస్తూ.. రానున్న ఆర్థిక సంవత్సరం కోసం భారీ బడ్జెట్ సిద్ధమయ్యింది. పెరిగిన ఆదాయం, జీఎస్​డీపీ వృద్ధి రేటును పరిగణనలోకి తీసుకొని పద్దు పరిమాణాన్ని బాగానే పెంచినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్‌ను అన్ని కోణాల్లో ఆలోచించి సిద్ధం చేసినట్లు తెలిసింది. ప్రాధాన్యతా పథకాలు, అవసరాలతో పాటు పెరిగే లబ్ధిదారులను దృష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేసినట్లు సమాచారం.

  • భారత్​లో వేడికి ఆంగ్లేయులు విలవిల..

Azadi Ka Amrit Mahotsav: దోచుకోవటానికి, దాచుకోవటానికి భారత్‌కు వచ్చారు. నయానో భయానో ప్రజల్నీ లొంగదీసుకున్నారు. కానీ వాతావరణాన్ని ఏం చేయగలరు? ఎండాకాలం రాగానే భారత్‌లో వేడికి ఆంగ్లేయులు తాళలేక విలవిలలాడేవారు.

  • ఆ పాత్రలు నాకు ఒత్తిడిగా అనిపిస్తాయి: సాయిపల్లవి

Saipallavi about her roles: కెరీర్‌లో విభిన్నమైన పాత్రలతో అలరించిన హీరోయిన్​ సాయిపల్లవి.. నటిగా తనకెలాంటి పాత్రలు ఒత్తిడిగా అనిపిస్తాయో తెలిపింది. వర్తమాన సమాజంలో కనిపించే పాత్రలతో పోల్చితే.. గత కాలానికి సంబంధించిన పాత్రలే కాస్త ఎక్కువ సౌకర్యవంతంగా అనిపిస్తుంటాయని చెప్పింది.

  • అప్పుడే మాకు భరోసా కలిగింది'

Prabhas RadheShyam movie: 'రాధేశ్యామ్​' సినిమా కోసం 36మందితో కలిసి ఇటలీలో ఏడాది పాటు రెక్కీ చేసినట్లు తెలిపారు ప్రముఖ ప్రొడక్షన్‌ డిజైనర్‌ రవీందర్‌. ఈ సినిమా సెట్స్​ను ఛాలెంజ్​గా తీసుకుని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇంకా ఈ మూవీ గురించి పలు ఆసక్తికర సంగతులను తెలిపారు. అవేంటో చూద్దాం..

  • వార్న్‌ చివరి క్షణాల్లో ఏం చేశారంటే?

shane warne last moments: ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్​ వార్న్​ మృతి.. యావత్ క్రికెట్​ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతికి కొన్ని క్షణాలకు ముందు ఏం జరిగిందో వార్న్ మేనేజర్ జేమ్స్ ఎర్స్​కిన్​​ తెలిపారు. కాగా, ఆయన​ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్​ ప్రకటించారు.

  • బంగారం ధరలు భగభగ..

Gold price hike: దేశీయంగా బంగారం కొనుగోళ్లు తగ్గుతున్నాయి. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పసిడి ధర క్రమంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. ఇప్పటికే 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేలకు చేరింది. యుద్ధం కొనసాగితే మరింత పైకి ఎగబాకే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు వివిధ కారణాలు పసిడిపై పెట్టుబడులు పెరిగి.. ధరలకు రెక్కలొచ్చాయని విశ్లేషకులు చెబుతున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.