ETV Bharat / city

తెలంగాణలోని కోర్టుల్లో సెప్టెంబర్ 5 వరకూ లాక్‌డౌన్ పొడిగింపు - తెలంగాణ హైకోర్టు లాక్​డౌన్

రాష్ట్రంలోని కోర్డుల్లో లాక్​డౌన్ సెప్టెంబరు 5 వరకు హైకోర్టు పొడిగించింది. బెయిల్, రిమాండ్ పొడిగింపు వంటి అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు స్పష్టం చేసింది. వీలైన చోట కోర్టులు తెరిచేందుకు జిల్లా ప్రధాన జడ్జీలకు హైకోర్టు స్వేచ్ఛ కల్పించింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

telangana high court lock down
telangana high court lock down
author img

By

Published : Aug 11, 2020, 4:21 PM IST

రాష్ట్రంలోని కోర్టుల్లో లాక్ డౌన్ సెప్టెంబరు 5 వరకు కొనసాగనుంది. హైకోర్టు, జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్ల లాక్ డౌన్ సెప్టెంబర్ 5 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్, రిమాండ్ పొడిగింపు వంటి అత్యవసర కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని జిల్లా కోర్టులకు స్పష్టం చేసింది.

పిటిషన్లు ఆన్ లైన్​తో పాటు నేరుగా కోర్టుల్లో కూడా సమర్పించే విధానం కొనసాగుతుందని పేర్కొంది. భౌతిక దూరం, మాస్కుల వంటి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వీలైన చోట కోర్టులు తెరిచేందుకు కూడా జిల్లా ప్రధాన జడ్జీలకు హైకోర్టు స్వేచ్ఛ కల్పించింది. అయితే జిల్లా పరిపాలన న్యాయమూర్తి, న్యాయాధికారులు, న్యాయవాదులతో చర్చించాలని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్ఠి కృషితో మెరుగైన వైద్యం సాధ్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.