సాంకేతికత రాష్ట్రాభివృద్ధిలో ప్రధానమైనదని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్‌తో ఇక్కడ అభివృద్ధి చేసిన ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్లి ప్రజల జీవితాలను మార్చేందుకు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్‌తో కలిసి హైదరాబాద్‌లో సైన్స్ అండ్ ఇన్నోవేషన్ క్లస్టర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రంలో ఐదు ప్రభావవంతమైన కంపెనీలను ప్రారంభించేందుకు ఈ క్లస్టర్ సాయం చేస్తుందని తెలిపారు. ఇన్నోవేషన్‌లో తెలంగాణను మొదటి స్థానంలో నిలుపుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల సరికొత్త రికార్డ్