ETV Bharat / city

నిరాశాజనకం: మన ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు నామమాత్రమే! - తెలంగాణ నీటి ప్రాజెక్టులు

రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహం నామమాత్రంగానే ఉంది. అన్ని జలాశయాలు బోసిపోయి ఉన్నాయి. ఎగువన ఉన్న ప్రాజెక్టులు నిండకపోవడంతో నీటిని దిగువకు వదలడం లేదు. ప్రాణహితలో కొంత ప్రవాహం ఉన్నందున త్వరలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.

telangana irrigation project
telangana irrigation project
author img

By

Published : Jul 5, 2020, 6:54 AM IST

కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టుల్లోకి నామమాత్రంగానే నీటి ప్రవాహం ఉంది. అన్ని రిజర్వాయర్లు ఖాళీగానే ఉన్నాయి. కృష్ణా బేసిన్‌లో ఎగువన ఉన్న ఆలమట్టిలోకి ఇప్పటివరకు 47 టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. మరో 70 టీఎంసీలు వస్తే గానీ దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. గోదావరిలో పైనున్న జైక్వాడిలోకి ఇప్పటివరకు ఐదున్నర టీఎంసీలు మాత్రమే వచ్చాయి. అయితే ప్రాణహితలో కొంత ప్రవాహం ఉన్నందున త్వరలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది.

నెట్టెంపాడు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభం

జూరాలకు వరద రాక పెరగడంతో నెట్టెంపాడు నుంచి నీటి ఎత్తిపోత మొదలైంది. ఎగువన కర్ణాటకలో వర్షాలతో జూరాలకు వరద పెరిగింది. శనివారం నెట్టెంపాడు లిఫ్ట్‌లను గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రారంభించారు. సీఏం కేసీఆర్‌ ఆదేశాల మేరకు నీటిని ఎత్తిపోస్తున్నామన్నారు.

శనివారం ఉదయం నీటి ఎత్తిపోతకు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే గ్రిడ్‌ నుంచి పంపింగ్‌ కేంద్రం.. విద్యుత్తు ఉప కేంద్రానికి విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా పంపులు ఆన్‌ కాలేదు. తిరిగి సాయంత్రం 5 గంటలకు పంపు నుంచి నీటి ఎత్తిపోత ప్రారంభించారు. జూరాలకు 5వేల క్యూసెక్కుల వరద వస్తోంది. అందులో 500 క్యూసెక్కులను నెట్టెంపాడు పంపుల కోసం వినియోగిస్తున్నామని ప్రాజెక్టు ఈఈ రహీముద్దీన్‌ తెలిపారు.

ఇదీ చదవండి: విజృంభిస్తున్న కరోనా... తల్లడిల్లుతున్న తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.