ETV Bharat / city

నెట్టింట్లో ఇంటర్ పాఠాలు.. త్వరలో యూట్యూబ్‌ ఛానల్‌ - తెలంగాణ ఇంటర్ బోర్డు యూట్యూబ్ ఛానెల్

కరోనా వైరస్ విజృంభణతో విద్యారంగం ఆన్‌లైన్ బాట పట్టింది. ఇప్పటివరకు ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రమే యూట్యూబ్‌ పాఠాలు బోధిస్తున్నాయి. కరోనా పరిస్థితుల్లో ఇంటర్ విద్యాశాఖ కూడా త్వరలో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించనుంది. పాఠ్యాంశాలను రికార్డు చేయించి యూట్యూబ్‌లో ఉంచనున్నారు.

ONLINE CLASS
ONLINE CLASS
author img

By

Published : Jul 15, 2020, 6:43 AM IST

ఉద్యోగ, పోటీ పరీక్షల శిక్షణ సంస్థలు, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు మాత్రమే ఇప్పటివరకూ పాఠ్యాంశాల బోధనను రికార్డు చేసి యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతున్నాయి. కరోనా పరిస్థితుల్లో విద్యాశాఖ కూడా అదేబాట పడుతోంది. ఇంటర్‌ విద్యాశాఖ త్వరలో యూట్యూబ్‌ ఛానల్‌ ప్రారంభించబోతోంది. ఇందుకోసం నిపుణులతో పాఠాల బోధనను రికార్డు చేయిస్తోంది. ఆదర్శ పాఠశాలలు, రాష్ట్ర విద్యా పరిశోధన- శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) కూడా ఇటీవలే యూట్యూబ్‌ ఛానళ్లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలను వినడంతో పాటు, రికార్డు చేసిన వీడియోల ద్వారా తమకు ఇష్టం వచ్చినప్పుడు వినడానికి, ఎన్నిసార్లయినా వినడానికి అవకాశం ఉంటుంది.

30 శాతం పూర్తి

కళాశాల, సాంకేతిక విద్యాశాఖతోపాటు విశ్వవిద్యాలయాలు భవిష్యత్తులో ఛానళ్లు ప్రారంభిస్తాయని ఇంటర్‌బోర్డు అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ వంటి కొన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు కూడా ప్రత్యేకంగా యూట్యూబ్‌ పాఠాలకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థుల కోసం ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇంటర్‌ ఎడ్యుకేషన్‌ ఈ-లెర్నింగ్‌’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించబోతోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాల బోధనను రికార్డు చేయించి యూట్యూబ్‌లో ఉంచనున్నారు. నిపుణులను ఇంటర్‌ విద్యాశాఖకు పిలిపించి పాఠాలను రికార్డు చేయిస్తున్నారు. ఇప్పటివరకు 30 శాతం పాఠ్యాంశాలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

ఆదర్శ పాఠశాలల ఛానల్‌లో ఇంటర్‌ పాఠాల బోధన షురూ

‘మోడల్‌ స్కూల్స్‌ తెలంగాణ’ పేరిట 10 రోజుల క్రితమే ఆదర్శ పాఠశాలల విభాగం యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించింది. ఇందులో ప్రస్తుతం ఇంటర్‌ రెండో ఏడాది పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో బోధిస్తున్నారు. బోధించే పాఠాల వివరాలను ముందుగానే ప్రకటిస్తున్నారు. మరో వారంలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం, తర్వాత 10వ తరగతి విద్యార్థులకు ఈ విధానాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. ఈ ఛానల్‌లో ఇప్పటివరకు 5,500 మంది చందాదారులు చేరారు.

‘ఎస్‌సీఈఆర్‌టీ తెలంగాణ’ పేరుతో ఓ ఛానల్‌ను అందుబాటులోకి తెచ్చారు. కరోనా నేపథ్యంలో గతంలోలా వర్క్‌షాపులు కాకుండా పలు అంశాలపై ఉపాధ్యాయులకు వెబినార్లే నిర్వహిస్తున్నారు. వాటిని యూట్యూబ్‌ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు, రికార్డు చేసి అందుబాటులో ఉంటుతున్నారు. విద్యార్థుల కోసం త్వరలో తరగతి పాఠాల బోధనను కూడా ఇలా నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి : కరోనా సోకితే గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటా: మంత్రి పువ్వాడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.