ETV Bharat / city

జూన్ 15న ఇంటర్ సెకండ్ ఇయర్ తరగతులు షురూ

Telangana Intermediate Board : 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌బోర్డు షెడ్యూల్‌ ఖరారు చేసింది. జూన్ 15న రెండో సంవత్సరం... జులై 1న మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. 2022-23 ఏడాదికి మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది.

Telangana Inter Board
Telangana Inter Board
author img

By

Published : May 16, 2022, 8:12 PM IST

Telangana Intermediate Board : 2022-23 విద్యా సంవత్సరానికి అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూన్ 15వ తేదీ నుంచి ఇంటర్‌ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి తరగతులు, సెలవులు, పరీక్షల షెడ్యూల్‌ను సోమవారం ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం 221 పని రోజులతో ఇంటర్ విద్యా సంవత్సరం ఉంటుందని తెలిపింది. అలాగే మొదటి సంవత్సరం తరగతులను జులై 1 నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

‘‘ Inter Schedule 2022-23 : ఈ ఏడాది మొత్తం 221 పని దినాలు ఉంటాయి. జూన్‌ 15 నుంచి సెకండ్‌ ఇయర్‌, జులై 1 నుంచి ఫస్ట్‌ ఇంటర్‌ తరగతులు మొదలవుతాయి. అక్టోబరు 2 నుంచి 9 వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నాం. ఫిబ్రవరి 6 నుంచి 13 వరకు ప్రీఫైనల్ పరీక్షలు, ఫిబ్రవరి 20 నుంచి మార్చి 6 వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తాం. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరుగుతాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు అమలు అవుతాయి. 2023 మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తాం. వచ్చే ఏడాది జూన్ 1న కాలేజీలు పునః ప్రారంభమవుతాయి’’ అని ఇంటర్ బోర్డు ప్రకటించింది.

..
..

ఇదీ చదవండి:ssc exams review: 'పది'లో పొరపాట్లు జరగకుండా కంట్రోల్​రూం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.