ETV Bharat / city

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శం : కేసీఆర్​

author img

By

Published : Oct 7, 2020, 7:24 PM IST

Updated : Oct 7, 2020, 8:14 PM IST

cm kcr
cm kcr

19:21 October 07

శాంతిభద్రతల పరిరక్షణలో తెలంగాణదేశానికే ఆదర్శం : కేసీఆర్​

అభివృద్ధిలో ముందుకు సాగుతున్న తెలంగాణ రాష్ట్రం శాంతిభద్రతల పరిరక్షణలోనూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. అందుకు విశేషంగా కృషిచేస్తున్న పోలీసుల భాగస్వామ్యాన్ని అభినందించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి పలు అంశాలపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. మహిళల భద్రతను ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుందని... వారి సంరక్షణ కోసం పోలీసులు మరింతగా శ్రమించాలన్నారు.

 మరింత కఠినంగా వ్యవహరించాలి

సమాజాన్ని పీడించే గంజాయి ఉత్పత్తి, అమ్మకం, రవాణా వ్యవస్థలను అరికట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అటవీ సంపదను కొల్లగొట్టే వారిపట్ల మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. కలప స్మగ్లింగ్ అరికట్టడంలో అటవీశాఖ అధికారులతో పాటు సివిల్ పోలీసు వ్యవస్థ భాగస్వామ్యం కావాలని సూచించారు. కరోనా నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో అక్కడక్కడా గుడుంబా తయారీ చేస్తున్నారనే సమాచారం ఉందన్నారు. గుడుంబా రహిత రాష్ట్రంగా మార్చిన ఎక్సైజ్, సివిల్ పోలీసులు అదే స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. గ్యాంబ్లింగ్ వంటి సామాజిక దురాచారాలను అరికట్టడంలో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్​ అన్నారు.  

ఫేక్​ సర్టిఫికెట్లపై దృష్టి సారించాలి

దేశవ్యాప్తంగా ఎస్సీలమీద దాడులు జరుగుతున్న వార్తలు వినడం శోచనీయమన్న ముఖ్యమంత్రి.. అలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పౌరులందరికీ  గౌరవాన్ని ఇస్తూ ఫ్రెండ్లీ పోలీస్‌ స్ఫూర్తిని పెంచుకోవాలన్నారు. రక్షణకోసం వచ్చిన అభాగ్యుల పట్ల మానవీయ కోణంలో మెలగాలని సూచించారు. నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారాల మీద పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి అరికట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫేక్ సర్టిఫికెట్లను సృష్టించే ముఠాలు, వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  

10లక్షల సీసీ కెమెరాలే లక్ష్యం

హైదరాబాద్‌లో 10 లక్షల CC కెమెరాల ఏర్పాటు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థలో ఐటీ పాత్రను పెంచి నేరాలను అరికట్టడంలో సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకోవాలని మార్గనిర్దేశం చేశారు. పోలీస్‌  కమాండ్ కంట్రోల్ అతి త్వరలోనే వినియోగంలోకి తీసుకొస్తామని.. వ్యవస్థీకృత నేరాలమీద ఉక్కుపాదం మోపాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.  

గౌరవ ప్రదంగా

పోలీసు శాఖలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ సెటిల్ చేసి, సర్వీసు చివరి రోజున గౌరవప్రదంగా పంపించాలని సీఎం సూచించారు. కారుణ్య నియామకాలను చేపట్టడంలో ఆలస్యం తగదన్నారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారసులకు తక్షణమే ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇతర శాఖల్లో ఖాళీలుంటే పరిశీలించి వెయిటింగ్ లిస్టులో ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు అందేలా చూడాలన్నారు. పోలీసు శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం మరింతగా కృషి జరగాలని ముఖ్యమంత్రి కేసీఆర్​ దిశానిర్దేశం చేశారు.  

ఇదీ చదవండి : అన్‌లాక్-5 మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Last Updated : Oct 7, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.