ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. పోలీస్ శాఖకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని.. వాహనాల కొనుగోలుకే రూ.700కోట్లు ఇచ్చామన్నారు. యూసుఫ్‌గూడలోని మొదటి బెటాలియన్ శిక్షణా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు.
499 మంది కానిస్టేబుళ్లు ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు. పోలీసులు సమాజ సేవకులుగా ప్రజలకు అందుబాటులో ఉండాలని.. ప్రజల భద్రత, సంక్షేమమే ధ్యేయంగా విధులు నిర్వహించాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోవడానికి పోలీస్ శాఖ పనితీరు కూడా ఎంతో దోహదపడుతుందన్నారు.