కరోనా ప్రబలకుండా హైకోర్టు ముందస్తు చర్యలు తీసుకుంది. సోమ, బుధ, శుక్రవారం మాత్రమే పనిచేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఆ మూడురోజులు అత్యవసర కేసులు మాత్రమే విచారించనున్నట్టు తెలిపింది. ఒక డివిజన్ బెంచ్, 4 సింగిల్ బెంచ్‌లు మాత్రమే కొనసాగుతాయని వెల్లడించింది. కోర్టుల్లోని మహిళా ఉద్యోగులు విధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని పేర్కొంది. హైకోర్టులో స్క్రీనింగ్ పరికరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
- ఇదీ చూడండి : సీఏఏ వ్యతిరేక తీర్మానానికి శాసనసభ ఆమోదం