ETV Bharat / city

Regularisation of Contract Employees: ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం - telangana high court news

Regularization of contract employees
telangana high court
author img

By

Published : Dec 7, 2021, 10:54 PM IST

22:31 December 07

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమం

Regularization of contract employees: రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గం సుగమమైంది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివిధ శాఖల్లోని ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు 2016 ఫిబ్రవరి 6న రాష్ట్ర ప్రభుత్వం జీవో16 జారీచేసింది. ఒప్పంద ఉద్యోగుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియనూ ప్రారంభించింది. అయితే జీవోను సవాల్ చేస్తూ నిరుద్యోగులు జె.శంకర్, ఎన్.గోవిందరెడ్డి 2017లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

గతంలో విచారణ జరిపిన హైకోర్టు.. జీవోపై స్టే ఇస్తూ 2017లోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. స్టే వల్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పిల్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్రశర్మ, జస్టిస్ తుకారాం ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. గతంలో దాఖలు చేసిన రిట్​ పిటిషన్​ కొట్టివేసిన విషయాన్ని పిల్​లో ఎందుకు ప్రస్తావించలేదంటూ పిటిషనర్లను ధర్మాసనం తప్పుపట్టింది. అనంతరం ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

ఇదీచూడండి: Dead body in Water tank: హైదరాబాద్​లో కలకలం.. వాటర్​ ట్యాంకులో మృతదేహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.