ETV Bharat / city

Kokapet Lands: జీవో 111పై సర్కారుకు హైకోర్టు ఆదేశం.. కోకాపేట వేలం విషయంలో చురకలు

author img

By

Published : Aug 17, 2021, 3:29 AM IST

Updated : Aug 17, 2021, 4:41 AM IST

కోకాపేట భూముల వేలాన్ని నిలిపివేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. జీవో 111 కు సంబంధించిన ప్రభుత్వం సమర్పించిన నివేదిక పరిశీలించిన మీదట ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇటీవల కోకాపేట భూముల వేలంలో జోక్యానికి నిరాకరించామని, ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​ను పరిశీలించిన మీదట గత ఉత్తర్వులను పునఃపరిశీలిస్తామని వేలానికి సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దీనికి జత చేయాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. భూములకు సంబంధించి ప్రభుత్వానివి ద్వంద్వ ప్రమాణాలని తప్పుబట్టింది.

telangana high court serious on kokapet lands auction

జీవో 111కు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో పాటు.. జీవో 111 పరిధిలో లేని తమ భూమిని మినహాయించాలంటూ అగ్ని అగ్రిటెక్ ప్రైవేట్‌ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్​పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కొన్ని సర్వే నంబర్లను మినహాయించడానికి అనుమతించాలంటూ 2010లో ప్రభుత్వం దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌... జీవో 111ను నీరుగారుస్తుందని అందువల్ల దానిపై విచారణకు పట్టుబట్టబోమని తెలిపారు. కమిటీ నివేదికకు నాలుగైదు వారాలు గడువివ్వాలని కోరగా.. ధర్మాసనం నిరాకరిస్తూ ఎందుకు అనుమతించాలని ప్రశ్నించింది. 4 ఏళ్ల 7 నెలలు గడిచినా కమిటీ స్పందించలేదనగా... ముఖుల్ రోహత్గి జోక్యం చేసుకుంటూ కొవిడ్ తోపాటు కేంద్రానికి చెందిన తెరి ( ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూబ్ ) తమ పరిధిలో లేదని, అది సహకరించేదాకా వేచి ఉండాల్సి వస్తోందనన్నారు.

వేలాన్ని నిలిపివేస్తాం..

ధర్మాసనం జోక్యం చేసుకుంటూ తెరికీ దీనిపై ఏదైనా లేఖ రాశారా అంటూ ప్రశ్నించింది. తమకు ఇచ్చిన అవకాశాలను తామే కాలరాసుకుంటున్నారని.. మళ్లీ ఎందుకివ్వాలని నిలదీసింది. ప్రభుత్వ స్పందనపై తమకు తీవ్ర అభ్యంతరాలున్నాయని వ్యాఖ్యానించింది. రోహత్గి జోక్యం చేసుకుంటూ తమ వైపు నుంచి పొరపాటు ఉందని గతంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని అగ్ని అగ్రిటిక్ పిటిషన్ చెల్లుబాటు కాదన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్​ను పరిశీలించాలని... కోకాపేట చెరువు , హిమాయత్ సాగర్​లోకి నీటి ప్రవాహానికి అడ్డుపడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. అలాంటప్పుడు ఇటీవల కోకాపేట భూముల్లో వేలాన్ని నిలిపివేస్తామని హెచ్చరించింది.

అక్కడ అడ్డంకులుంటే... ఇక్కడా ఉంటాయి..

ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్ కుమార్ జోక్యం చేసుకుంటూ వేలం వేసిన కోకాపేట భూములు జీవో 111 పరిధిలోకి రావని... అక్కడి నుంచి ఒక చుక్క నీరు కూడా చెరువులోకి రావన్నారు. ఇవి చెరువుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ జీవో 111 పరిధిలోకి వస్తుందని తామూ చెప్పలేదని, వట్టినాగులపల్లి నిర్మాణాలతో నీటి ప్రవాహానికి అడ్డంకులున్నప్పుడు.. అక్కడా ఉంటాయంది. ఎన్ని ఎకరాలు వేలం వేశారు..? ఎంత మొత్తం వచ్చింది..? అన్న ప్రశ్నలకు న్యాయవాది సమాధానమిస్తూ... 49 ఎకరాలకు 2వేల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. ఈ దశలో అగ్ని అగ్రిటెక్ తరపు సీనియర్ న్యాయవాది కె.వివేక్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ... ప్రభుత్వం పేర్కొన్న అంశాలు తమకు అనుకూలంగా ఉన్నాయని 2000 సంవత్సరంలో తామే ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చామని అప్పుడు కమిటీ వేసి సర్వే చేయించి తాము జీవో 111 పరిధిలోకి రామని తేల్చిందన్నారు. తరువాత ప్రభుత్వం ఈ భూములను మినహాయించాలంటూ పిటిషన్ వేసి ఇప్పుడు ఉపసంహరించుకుంటోందని, 2010 నుంచి ఎదురుచూశామన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తామే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

వాయిదా కోరడానికి వీల్లేదు...

వాదనలను విన్న ధర్మాసనం గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి కమిటీ సమావేశ తీర్మానాలను సమర్పించడానికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది గడువు తీసుకుంటూ ఏజీ వస్తారని చెప్పారని సీనియర్ న్యాయవాది ముఖుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ న్యాయవాది నుంచి సరైన సమాచారం అందకపోవడంతో సమగ్ర ఆఫిడవిట్ దాఖలు చేయడానికి గడువు కోరడంతో విచారణను 18కి వాయిదా వేసింది. దీంతో పాటు గత ఆదేశాల మేరకు ఉన్నతస్థాయి కమిటీ తీర్మానాలను సమర్పించాలని ఆదేశించింది. 18 న ఏ కారణంగా కూడా ఏ న్యాయవాది వాయిదా కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:

CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్

Last Updated : Aug 17, 2021, 4:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.