ETV Bharat / city

ప్రభుత్వం కన్నా ప్రైవేట్‌ ఆసుపత్రులు శక్తివంతమా? : హైకోర్టు - తెలంగాణ హైకోర్టు తాజావార్తలు

కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం నివేదించింది. వైరస్‌ నియంత్రణకు పరీక్షల సంఖ్య పెంపుతో పాటు జిల్లాల్లోనూ కొవిడ్‌ కేర్‌ కేంద్రాలను పెంచుతున్నట్లు వివరించింది. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఏం జరుగుతుందని ప్రశ్నించిన హైకోర్టు చర్యలకు సర్కార్‌ వెనకాడటంలో ఆంతర్యమేంటని ప్రశ్నించింది.

Telangana High court Serious on Government on Corona tests
50 ఫిర్యాదులొస్తే.. 2 ప్రైవేటు ఆసుపత్రులపైనే చర్యలా..?
author img

By

Published : Aug 13, 2020, 11:01 PM IST

Updated : Aug 14, 2020, 6:35 AM IST

కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు అన్ని రకాలుగా పనిచేస్తున్నామని హైకోర్టుకు రాష్ట్రప్రభుత్వం నివేదించింది. ఈ నెల 3 నుంచి సుమారు 42 వేల మంది సెకండరీ కాంటాక్ట్‌లకు కొవిడ్‌ పరీక్షలు జరిపినట్లు తెలిపింది. హోటళ్లలోనూ ఐసోలేషన్‌ పడకలు ఏర్పాటు చేశామని, తద్వారా 857 నుంచి 2,995కి పడకల సంఖ్య పెరిగినట్లు వివరించింది. జిల్లాల్లోనూ మహమ్మారి నియంత్రణ కోసం 86 కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రుల్లో అడ్మిషన్ల ప్రక్రియ సులభతరమైందని పేర్కొంది. కరోనా చికిత్సలు అందిస్తున్న క్రమంలో ప్రైవేట్‌ ఆసుపత్రులపై 50 ఫిర్యాదులు రాగా... తక్షణం స్పందించిన యంత్రాంగం 46 దవాఖానాలకు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. హెల్త్‌ బులెటిన్‌లో గణాంకాల గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నామని ఆధారాలను సమర్పించింది. కరోనా మృతదేహాల తరలింపు కోసం 61 వాహనాలను సిద్ధం చేసినట్లు వివరించింది.

2 ఆసుపత్రులపైనే చర్యలా?

ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో అసలు ఏం జరుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రైవేట్‌ ఆసుపత్రులు ప్రభుత్వం కన్నా శక్తివంతంగా కనిపిస్తున్నాయన్న హైకోర్టు... షోకాజ్‌ నోటీసులిచ్చిన 30 ఆసుపత్రులు కనీసం వివరణ ఇవ్వలేకపోవడం శోచనీయమంది. 50 ఫిర్యాదులు వస్తే కేవలం 2 ఆసుపత్రులపై చర్యలు తీసుకోవడమేంటని ప్రశ్నించింది. యాభై శాతం పడకలు అధీనంలోకి తీసుకుంటామని వైద్యారోగ్యశాఖ మంత్రి ప్రకటించినా మూడురోజులైనా ఆ దిశగా ఎలాంటి కదిలిక కనిపించడం లేదని గుర్తుచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉల్లంఘించిన ప్రైవేట్‌ ఆసుపత్రుల లీజులు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని పేర్కొంది. బులెటిన్‌లో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ పరీక్షల వివరాలెవీ సమగ్రంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. కరోనా కేర్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయో, మృతదేహాలు తీసుకెళ్లే వాహనాల సమాచారం ప్రజలకు కొరవడిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. రాపిడ్‌ యాంటీ జెన్‌ పరీక్షల కచ్చితత్వాన్ని పరిశీలించారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. హితం యాప్‌ ప్రచారం ఎక్కడా కనిపించడం లేదన్న కోర్టు జిల్లాల్లో ఆక్సిజన్‌ సదుపాయం ఉన్న పడకలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించింది.

రోజుకు 40వేల పరీక్షలు

కరోనా నియంత్రణకు సిబ్బంది రాత్రీ పగలు కష్ట పడుతున్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరించారు. రాష్ట్రంలో రోజుకు 40 వేల రాపిడ్‌ పరీక్షలు జరిపేలా ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్​ఎంసీలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న సీఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలన్నింటికీ ఆక్సిజన్ సదుపాయం కల్పించామన్నారు. హితం యాప్‌ను ఇప్పటి వరకు 46వేల మంది వినియోగించారని, హైకోర్టు సూచనల మేరకు తెలుగులోనూ బులెటిన్ ఇచ్చామని వివరించారు. ప్రైవేట్ ఆసుత్రులపై నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆస్పత్రులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కరోనా కేర్ కేంద్రాల వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సద్విమర్శే...

కరోనా యోధులు మా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధికారులను నైతిక స్థైర్యం దెబ్బ తీయాలనే ఉద్దేశం లేదన్న హైకోర్టు ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని విమర్శించాలనేది తమ ఉద్దేశం కాదని వివరించింది. చిన్నచిన్న లోపాలను సరిదిద్దాలనేదే మా ప్రయత్నమని పేర్కొంది. దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా తీరిద్దాలని తమ ప్రయత్నమని చెప్పింది. రాష్ట్రప్రభుత్వం సరైన దిశలోనే వెళ్తోందన్న హైకోర్టు సుమారు 99 శాతం పర్‌ఫెక్షన్‌ వచ్చిందని వ్యాఖ్యానించింది.

ఇవీ చూడండి: పొంగిపొర్లుతున్న లక్నవరం చెరువు, జంపన్న వాగు

Last Updated : Aug 14, 2020, 6:35 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.