Minister Koppula Eshwar Case: ఎమ్మెల్యేగా తన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించాలన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ధర్మపురి నియోజకవర్గం నుంచి 2018లో ఎన్నికల్లో తెరాస నుంచి కొప్పుల ఈశ్వర్.. కాంగ్రెస్ నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పోటీ చేశారు. ఈవీఎంల వీవీ ప్యాట్ లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలుపొందినట్లు ప్రకటించారని.. అది ప్రజాప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని 2019లో లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.
కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్ను తిరస్కరించాలని.. న్యాయస్థానాన్ని కొప్పుల ఈశ్వర్ కోరారు. పిటిషన్లో సరైన కారణాలు చూపలేదని కొప్పుల ఆరోపించారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు... కొప్పుల ఈశ్వర్ పిటిషన్ కొట్టివేసింది. కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ పిటిషన్పై త్వరలోనే హైకోర్టు విచారణ చేపట్టనుంది.
ఇవీ చూడండి: