నిజామాబాద్ జిల్లా ఉట్లూరులో ఊరచెరువు శిఖంలో అక్రమంగా నిర్మిస్తున్న రైతు వేదికను ఆపాలని కోరుతూ ఉట్లూరుకు చెందిన చిల్కూరు బాజన్న దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్‌చౌహాన్, జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
అధికారులకు వినతిపత్రం సమర్పించినప్పటికీ స్పందించడం లేదని పిటిషనర్ ధర్మాసనానికి పేర్కొన్నారు. వ్యక్తిగతంగా విచారణ జరపాలని నిజమాబాద్ కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ చెరువు శిఖంలో రైతు వేదిక నిర్మిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆపాలని పాలనాధికారికి స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్ 5కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి : జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్.. రూ. 45 లక్షలు డిమాండ్!