ETV Bharat / city

SCHOOLS RE OPEN: 'పాఠశాలల ప్రారంభంపై మార్గదర్శకాలు రూపొందించండి' - telangana latest news

పిల్లల ఆరోగ్యం, క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పాఠశాలల ప్రారంభంపై వారం రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలని విద్యా శాఖను హైకోర్టు ఆదేశించింది. ప్రత్యక్ష బోధనకు హాజరు తప్పనిసరి కాదని.. ఆన్​లైన్​ తరగతులు కొనసాగుతాయని విద్యా శాఖ వివరించింది. ఉపాధ్యాయులు, అధ్యాపకులకు ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

SCHOOLS RE OPEN IN TELANGANA
SCHOOLS RE OPEN IN TELANGANA
author img

By

Published : Jun 23, 2021, 7:25 PM IST

జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా తీవ్రత, మూడోదశ విజృంభణపై ఊహాగానాల నేపథ్యంలో ప్రభుత్వం పాఠశాలలు తెరిస్తే పిల్లల ప్రాణాలకే ముప్పని న్యాయవాది రవిచందర్ వాదించారు. రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా విచారణకు హాజరై వివరణ ఇచ్చారు.

అందరూ హాజరుకావాల్సిందేనా..?

మూడో దశ కరోనా ముంచుకొస్తోందని.. పిల్లలపై ప్రభావం ఉంటుందని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నందున.. సహజంగానే తల్లిదండ్రుల్లో ఆందోళన ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో అన్ని తరగతుల విద్యార్థులూ పాఠశాలలకు హాజరు కావల్సిందేనా...? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ప్రశ్నించింది. ప్రత్యక్ష బోధనకు విద్యార్థులందరూ కచ్చితంగా హాజరు కావల్సిన అవసరం లేదని విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. ఆన్​లైన్​ బోధన కూడా కొనసాగుతుందని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

రెండు మూడు రోజుల్లో విధివిధానాలు..

చిన్న పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ధర్మాసనం అభిప్రాయాన్నీ పరిగణనలోకి తీసుకొని.. రెండు, మూడు రోజుల్లో విధివిధానాలకు ఖరారు చేయనున్నట్లు సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.

హైరిస్క్​ కేటగిరీగా..

ఉపాధ్యాయులు, అధ్యాపకులను హైరిస్క్ కేటగిరీగా పరిగణించి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. నేటి నుంచి రాష్ట్రంలోని సుమారు 5 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బందికి వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు ధర్మాసనానికి వివరించారు.

మరణించిన వారికి..

ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా బారిన పడిన 17 మంది ఉపాధ్యాయులు, ఇద్దరు అధ్యాపకులు మరణించారని విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. వారి కుటుంబాలకు రావల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలకు అందించామన్నారు. పీఎఫ్, మరికొన్ని ప్రయోజనాలు రావాల్సి ఉందని తెలిపింది. పీఎఫ్, ఇతర బెన్​ఫిట్స్ కూడా త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని... విద్యాశాఖకు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సూచించింది.

ఇదీచూడండి: విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.