Telangana High Court: డీఎల్ఎఫ్కు దక్కిన భూమిని మైహోం సంస్థకు అక్రమంగా కట్టబెట్టారంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయనందుకు ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆరు వారాల గడువు ఇస్తున్నామని.. ఆలోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో... హైదరాబాద్ రాయదుర్గంలోని ఐటీ అభివృద్ధి కోసం 31 ఎకరాలను టెండర్లలో డీఎల్ఎఫ్ దక్కించుకొందని.. రాష్ట్రం ఏర్పాటు అనంతరం ఆ భూమిని నిబంధనలకు విరుద్ధంగా మైహోం దక్కించుకుందని రేవంత్రెడ్డి గతంలో హైకోర్టులో పిల్ వేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. కౌంటరు దాఖలుకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరగా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో చాలా సార్లు సమయం ఇచ్చామని గుర్తుచేసింది. ఆరువారాల గడువు ఇస్తున్నామని ఆలోగ సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
ఇదీచూడండి: