ETV Bharat / city

Minister Harish on Omicron : 'పండుగలొస్తున్నయ్.. జర భద్రంగా ఉండండి' - vanasthalipuram area hospital

Minister Harish on Omicron : రాష్ట్రంలో కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేలా ప్రభుత్వం మరిన్ని ఏర్పాట్లు చేస్తోందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హైదరాబాద్​ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి.. 100 పడకల వార్డు, ఆక్సిజన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. పండగల వేళ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.

Minister Harish on Omicron
Minister Harish on Omicron
author img

By

Published : Dec 24, 2021, 11:05 AM IST

Updated : Dec 24, 2021, 11:44 AM IST

పండుగులొస్తున్నయ్.. జర భద్రం

Minister Harish on Omicron : రానున్న రోజుల్లో క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలొస్తున్నందున రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య మంత్రి హరీశ్ రావు సూచించారు. అందరు కరోనా నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున జాగ్రత్తగా ఉండాలని, ఎక్కువగా గుమిగూడి ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పారు. ఒమిక్రాన్​ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి.. వ్యాక్సినేషన్, అప్రమత్తతో దాన్ని జయించవచ్చని అన్నారు.

Minister Harish at Vanasthalipuram Area Hospital : రాష్ట్రంలో కరోనా మూడో ముప్పు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేందుకు సర్కార్ సిద్ధమని మంత్రి హరీశ్ తెలిపారు. హైదరాబాద్​ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. 100 పడకల వార్డు, ఆక్సిజన్ ప్లాంట్​ను ప్రారంభించారు. నిర్మాణ్ సంస్థ సహకారంతో 12 ఐసీయూ పడకల వార్డు, ఇన్ఫోసిస్ సహకారంతో ఆక్సిజన్ ప్లాంట్​ను ఏర్పాటు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు.

"అందరూ కొవిడ్ జాగ్రత్తలు పాటించాలి. ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెబుతున్నాయి. అలా అని నిర్లక్యం వద్దు. అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. పండుగల వేళ మరింత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ వినియోగించాలి. ప్రభుత్వానికి సహకరించాలి."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య మంత్రి

Minister Harish on Corona Third Wave : హైదరాబాద్​లో 1600 కరోనా పడకలు.. (నిలోఫర్​లో 800, మరో 6 ఆస్పత్రుల్లో 100 చొప్పున) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. వైద్యం కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఇటీవలే కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు.

Minister Harish on Corona Vaccination : "పేదలకు అన్ని రకాల వైద్య సేవలు అందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించాలన్నదే ఆయన లక్ష్యం. ఫ్రూట్ మార్కెట్ వద్ద 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి రానుంది. ఇక్కడి ప్రజలు సంతోషించదగ్గ విషయం. త్వరలోనే సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మన బస్తీ దవాఖానాలు దేశానికే ఆదర్శం. నగరంలో ఎక్కువ అవసరం ఉన్న ప్రాంతంలో మరిన్ని బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఆదేశించారు."

- హరీశ్ రావు, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి

Last Updated : Dec 24, 2021, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.