Harish Rao review on covid: రాష్ట్రంలో కరోనా మరోసారి విజృంభిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్కారు ముందు జాగ్రత చర్యలు తీసుకుంటోంది. బీఆర్కే భవన్లో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. సీఎస్ సోమేశ్‌కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఏంఐడీసీ ఎండీ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. 21 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు కొనుగోలు చేయాలని.. వైద్యారోగ్య శాఖ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులను గమనించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 545 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కలిగి ఉండేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ప్రతి పడకకు ఆక్సిజన్ సదుపాయం ఉండాలని సూచించారు. ఇక వైరస్‌ను కట్టడి చేయడంలో వ్యాక్సిన్ కీలక పాత్రపోషిస్తుందన్న మంత్రి.. టీకా రెండో డోస్ పంపిణీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచూడండి: దేశంలో ఒమిక్రాన్ 'పీక్' ఎప్పుడు? భారత్ సిద్ధమేనా?