Minister Harish Rao Review on Corona : ఆరోగ్య తెలంగాణ కలను సాకారం చేసేందుకు రాష్ట్రంలో ఓ వైపు కొత్త ఆస్పత్రులు, ఉన్న దవాఖానాల ఆధునికీకరణ, మరోవైపు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ మర్రిచెన్నారెడ్డి మావనవనరుల కేంద్రంలో కరోనా, జ్వర సర్వే, వాక్సినేషన్ అంశాలపై వైద్యారోగ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Harish Rao Review on Fever Survey: కరోనా కట్టడి కోసం మొదలుపెట్టిన జ్వర సర్వే విజయవంతంగా కొనసాగుతుందన్న మంత్రి.. వ్యాక్సినేషన్‌ను వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా 20 బ్లడ్ స్టోరేజీ సెంటర్లు (రక్త నిల్వ కేంద్రాలు) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒక్కొక్కటి రు. 12 లక్షల ఖర్చుతో 12 జిల్లాల పరిధిలోని పలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో నెలకొల్పాలని చెప్పారు.
Minister Harish Rao Review on vaccination : రాష్ట్రంలో ఇప్పటి వరకు 57 బ్లడ్ బ్యాంకులు ఉండగా, 51 బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయని హరీశ్ రావు తెలిపారు. కొత్త ఆస్పత్రుల ఏర్పాటుతో పాటు సూపర్ స్పెషాలిటీ సేవలను పేదలకు చేరువ చేసేందుకు ఉన్న ఆస్పత్రులను ఆధునికీకరిస్తున్నట్లు చెప్పారు. లేబర్ రూములు, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, అన్ని రకాల మరమ్మతులు చేపట్టడం, ఆధునీకరణపై దృష్టి సారించామని అన్నారు. 10.84 కోట్ల రూపాయలతో రాష్ట్రంలోని 4 జిల్లా దవాఖానాలు, 8 ఏరియా హాస్పిటళ్లు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యశాఖ మరమ్మతులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ జాబితాలో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, నిజామాబాద్, హైదరాబాద్, నిర్మల్, కరీంనగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి, మెదక్, నాగర్ కర్నూల్, సిద్దిపేట జిల్లాలు ఉన్నాయని వివరించారు.
- ఇదీ చదవండి : 'ఫిబ్రవరి 15 నాటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం!'