Harish Rao Review on Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమ్రికాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న దృష్ట్యా.. విదేశీ ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో వైద్యాధికారులతో సమావేశమయ్యారు.
మరో భేటీ.. కీలక నిర్ణయాలు..
Measures to control Corona New Variant : కొత్త వేరియంట్ ఉన్న దేశాల నుంచి రాకపోకలపై చర్చిస్తున్నారు. నిన్న అధికారులతో భేటీ అయిన హరీశ్‌రావు.. ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. అంతర్జాతీయ ప్రయాణికులపై ఇప్పటికే రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల ట్రేసింగ్, టెస్టింగ్‌పై హరీశ్‌రావు రేపు అధికారులతో చర్చించనున్నారు.
వణుకు పుట్టిస్తోన్న ఒమిక్రాన్..
Omicron in South Africa : కరోనా కేసులు తగ్గినా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'.. ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో.. ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన 'బి.1.1.529' వేరియంట్ పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని.. వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంక్షలపై యోచన..
Omicron Variant Latest News : కొత్త వేరియంట్ వెలుగుచూసిన క్రమంలో చాలా దేశాలు దక్షిణాఫ్రికా (Omicron Variant) నుంచి రాకపోకలను నిలిపివేశాయి. దీంతో పర్యాటకం, వ్యాపారం, కుటుంబ సభ్యులను కలిసే నిమిత్తం దక్షిణాఫ్రికా వచ్చిన వందల మంది విదేశీయులు జొహానెస్‌బర్గ్, కేప్‌టౌన్ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. కొన్నిదేశాలు తమ పౌరులు మాత్రమే అక్కడి నుంచి వచ్చేందుకు అనుమతిస్తున్నాయి. భారత్ కూడా ఈ దిశగా ఆలోచన చేస్తోంది. కొవిడ్‌కు ముందు షెడ్యూలు అయిన ప్రయాణికుల (Omicron Variant) విమానాల్లో సగం మాత్రమే దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్ నుంచి రాకపోకలు సాగించేలా అనుమతించాలని నిర్ణయించింది. డిసెంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ మూడింటిని 'ఎట్-రిస్క్' దేశాలుగా కేంద్ర ఆరోగ్యశాఖ వర్గీకరించింది.
ఇవీ చదవండి :