ETV Bharat / city

మాతృభాషలో బోధన విద్యార్థులకు ఉపయోగకరం: గవర్నర్

author img

By

Published : Aug 13, 2020, 8:02 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యవిధానంపై విద్యారంగ ప్రముఖులు, విద్యావేత్తలతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెబినార్ నిర్వహించారు. విద్యా హబ్‌గా ఎదిగేందుకు తెలంగాణకు అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనతో పిల్లల్లో మానసిక వికాసం పెరుగుతుందని వెల్లడించారు. భారత్ పునర్‌ వైభవానికి విద్యా నిపుణులు కృషి చేయాలని సూచించారు.

Telangana Governor Tamili sai Education Policy Webinar in Hyderabad
మాతృభాషలో బోధన విద్యార్థులకు ఉపయోగకరం: గవర్నర్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన విద్యా విధానం భారతదేశాన్ని విద్యారంగంలో ప్రపంచ స్థాయిలో నిలపడానికి తోడ్పడుతోందని.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. పర్‌స్పెక్టివ్ ఆన్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 - రోడ్ మ్యాప్ ఫర్ తెలంగాణ అన్న అంశంపై విద్యారంగ ప్రముఖులతో గవర్నర్ వెబినార్ నిర్వహించారు. సమూల సంస్కరణలతో 21వ శతాబ్దపు విద్యా విధానం ఉందని.. తెలిపారు.

కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలను ప్రోత్సహించేలా... సాంకేతికతతో పాటు భారతీయ మూలాలను గౌరవించే విద్యా విధానానికి రూపకల్పనే ఇదని ప్రశంసించారు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో బోధనతో పిల్లల్లో మానసిక వికాసం ఏర్పడుతుందని... భవిష్యత్ తరాలను ప్రపంచ నైపుణ్యాలతో తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. భారత్ పునర్‌ వైభవానికి విద్యా నిపుణులు కృషి చేయాలని కోరారు. విద్యా హబ్‌గా ఎదిగేందుకు తెలంగాణకు అపార అవకాశాలున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి : తండ్రిని కొట్టి చంపిన తనయుడు.. కారణమిదే!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.