ETV Bharat / city

TRS MLAs : రేవంత్​పై తెరాస ఫైర్.. బాలరాజు, జీవన్​రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

author img

By

Published : Aug 19, 2021, 12:42 PM IST

కాంగ్రెస్ పార్టీకి అటు జాతీయ స్థాయిలో.. ఇటు రాష్ట్రస్థాయిలో సరైన సారధి లేరని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. దిక్కులేని పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పజెప్పారని తెలిపారు. పార్టీకి అధ్యక్షుడైనా.. రేవంత్ తన పద్ధతి మార్చుకోలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్.. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆయన చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇదే విధంగా తన ప్రవర్తన కొనసాగితే.. రేవంత్​ రాజకీయ ప్రయాణాన్ని భూస్థాపితం చేస్తామని ఎమ్మెల్యేలు హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్​ భూస్థాపితమే

ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తప్పుబట్టారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైనా.. రేవంత్ తన ప్రవర్తన మార్చుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని ధ్వజమెత్తారు.

మహిళపై ఆ వ్యాఖ్యలేంటి..

కాంగ్రెస్ పార్టీ సీనియర్లంటే తమకు అభిమానం ఉందన్న బాలరాజు... సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఓ అనామకుడికి పార్టీ పగ్గాలు అప్పజెప్పారని అన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడే తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలని రేవంత్​కు సూచించారు. తెరాస నాయకులను ఇష్టం వచ్చినట్లు తిట్టడమే కాకుండా ఓ మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

రాజకీయంగా తొక్కేస్తాం..

దళితబంధు పథకం అమలుపై ప్రజాభిప్రాయానికి సిద్ధమా..? అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి.. తెరాస ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జీవన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. దళితులు రాష్ట్రంలో అమలవుతున్న ఏ సంక్షేమ పథకాన్నీ వ్యతిరేకించలేదని చెప్పారు. ఎస్సీలకు ఏదైనా చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన పథకంపై విమర్శలు చేయడం తగదన్నారు. దళిత బంధు ఆపాలనుకునే వారి కుట్రలను బయటపెడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. ఉద్యోగ నియామకాలపై అసత్య ప్రచారం మానుకోవాలని స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిపై అనవసర, అర్థరహిత, తప్పుడు వ్యాఖ్యలు చేస్తే రాజకీయంగా తొక్కేస్తామని హెచ్చరించారు.

బాధాకరం..

ఓవైపు రేవంత్ అర్థరహిత ఆరోపణలు చేస్తూ.. నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటే అతడికి మద్దతుగా సీనియర్ నేతలు వత్తాసు పలకడం బాధాకరమని బాలరాజు అన్నారు. ఓటుకు నోటు కేసు, ఆర్థిక నేరాల్లో రేవంత్ ఎప్పుడో ఓసారి జైలుకు వెళ్తాడని.. అతణ్ని నమ్ముకున్న నాయకుల రాజకీయ భవిష్యత్​ భూస్థాపితమేనని వ్యాఖ్యానించారు. దళితుల కోసం సీఎం ప్రవేశపెట్టిన పథకానికి మద్దతు ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేం రెడీ..

" ప్రజాక్షేత్రంలో పోటీకి మేం రెడీ. చివరి ప్రసంగం ఎవరిదో చూద్దాం. రేవంత్ రెడ్డి.. మీరు రాజకీయాల్లో కొనసాగాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. దళిత బంధును వ్యతిరేకించే మీరు.. ఎన్నికల్లో దళితులను ఓట్లు అడగగలరా. వారి కాలనీలో అడుగు పెట్టగలరా. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్ని విమర్శలు చేసినా మాకు అభ్యంతరం లేదు. ప్రతిపక్ష పార్టీలుగా ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించే.. వ్యతిరేకించే హక్కు మీకుంది. కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడే హక్కు మీకెవరిచ్చారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తలనే తొక్కేస్తాం అనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం సబబేనా. విలువలు కాలరాసే విధంగా రేవంత్ మాట్లాడారు. ప్రింటింగ్ ప్రెస్​లో పనిచేసిన రేవంత్.. వేల కోట్లకు ఎలా పడగెత్తారు. నా నియోజకవర్గానికి వచ్చి.. నన్నే ఇష్టం వచ్చినట్లు తిట్టారు. రేవంత్​పై చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మానవ హక్కుల సంఘాన్ని కోరుతున్నాను."

- గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్

మరో 20 ఏళ్లు కేసీఆర్ సీఎం..

రాబోయే 20 ఏళ్ల వరకు కేసీఆరే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటారని బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్న తామంతా.. పేదరికం నుంచి వచ్చిన వారు.. చదువుకున్న వారు.. ఉద్యమంలో పనిచేసిన వారమేనని తెలిపారు. గజ్వేల్​లో సభపెట్టి కేసీఆర్​ తలను తొక్కేస్తానని రేవంత్ చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్ తన ప్రవర్తన మార్చుకోకపోతే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించాకు. తమ శక్తిని ప్రదర్శిస్తే రేవంత్.. గజ్వేల్ గడ్డపై కాలు కూడా మోపలేరని గువ్వల అన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.