ETV Bharat / city

అన్ని పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌.. - QR code in school textbooks in telangana

రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరానికి (2021-22) పాఠశాల పాఠ్య పుస్తకాల్లో పూర్తిస్థాయిలో క్యూఆర్‌ కోడ్‌ను అమలు చేయనున్నారు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కలిపి 37 పాఠ్యపుస్తకాల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

telangana-government-to-print-qr-code-in-school-textbooks
అన్ని పాఠ్యపుస్తకాల్లో క్యూఆర్‌ కోడ్‌..
author img

By

Published : Dec 20, 2020, 7:30 AM IST

తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరానికి(2021-22) పాఠశాల పాఠ్య పుస్తకాల్లో పూర్తిస్థాయిలో క్యూఆర్ కోడ్​ అమలు కానుంది. ఇందుకోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ)లో సబ్జెక్టు నిపుణులతో కసరత్తు మొదలైంది. ప్రత్యేకంగా దీనికి ఓ బృందాన్ని నియమించారు. వచ్చే ఏడాదికి సంబంధించి ఫిబ్రవరి నుంచి పుస్తకాల ముద్రణ ప్రారంభమవుతుంది. ఆలోపు ఆ కోడ్‌లను చేరుస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతి అధ్యాయానికి కనీసం ఒక క్యూఆర్‌ కోడ్‌ను ఉంచాలన్నది లక్ష్యం. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అన్ని సబ్జెక్టులు కలిపి 37 పాఠ్యపుస్తకాల్లో ఈ కోడ్​ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

2019-20లోనే శ్రీకారం

పాఠ్య పుస్తకాల్లో మొత్తం సమాచారాన్ని ముద్రించలేరు. పెరుగుతున్న పోటీ నేపథ్యంలో పుస్తకంలో ఉన్న సమాచారాన్ని మాత్రమే కాకుండా ఆసక్తి ఉన్నవారు, తెలివైన విద్యార్థులు మరింత లోతుగా, వివరంగా తెలుసుకోవాలనుకునే వారు ఉంటారు. వారిని దృష్టిలో ఉంచుకొని క్యూఆర్‌ కోడ్‌ను పుస్తకాల్లో ముద్రిస్తున్నారు. సాంకేతికతను పిల్లలు బాగా ఇష్టపడుతున్నారని, అందుకే కాలానుగుణంగా మార్పులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే 2019-20 విద్యా సంవత్సరమే ప్రయోగాత్మకంగా 8వ తరగతి జీవ, భౌతికశాస్త్రాల పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించారు. 2020-21 విద్యా సంవత్సరానికి దాన్ని 9వ తరగతికి ఆ రెండు సబ్జెక్టులతో పాటు గణితం, సాంఘికశాస్త్రం పుస్తకాల్లో అమలు చేశారు. వచ్చే ఏడాదికి 6-10 తరగతులకు అన్ని సబ్జెక్టులకు విస్తరిస్తున్నారు. ఈ ప్రక్రియకు కేంద్ర విద్యాశాఖ ఆర్థిక సాయం చేస్తోంది.

ఏమిటీ క్యూఆర్‌ కోడ్‌?

క్యూఆర్‌ కోడ్‌ అంటే క్విక్‌ రెస్పాన్స్‌ కోడ్‌ అని అర్థం. ఆయా పాఠ్యాంశాల్లో అవసరమైన చోట క్యూఆర్‌ కోడ్‌ను ముద్రిస్తారు. స్మార్ట్‌ ఫోన్‌ సహాయంతో దాన్ని స్కాన్‌ చేస్తే మరింత వివరంగా సమాచారం, వీడియోలు, చిత్రాలు వస్తాయి. దీక్ష యాప్‌ ద్వారా కూడా క్యూఆర్‌ కోడ్‌లోని సమాచారాన్ని పొందవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.