ఆలుగడ్డ కూర లేదా చిప్స్‌లాంటి ఉత్పత్తులు తినని ఇల్లు ఉండదు. కానీ తెలంగాణలో మాత్రం ఈ పంట(Potato Cultivation in Telangana) పండటం లేదు. వాస్తవంగా ఒక సంవత్సర కాలంలో రాష్ట్ర అవసరాలకు 2.03 లక్షల టన్నుల ఆలుగడ్డలు(Potato Cultivation in Telangana) అవసరం. గతేడాది ఇక్కడి రైతులు కేవలం 47,169 టన్నులే పండించారు. ఫలితంగా వ్యాపారులు ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నారని, అందుకుగానూ రూ.403 కోట్లు వెచ్చించారని ఉద్యానశాఖ అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో ఈ యాసంగి(రబీ) నుంచే రాష్ట్రంలో అదనంగా 50 వేల ఎకరాల్లో ఈ పంట(Potato Cultivation in Telangana) సాగుచేసేలా రైతులను చైతన్యపరచాలని ఈ శాఖ తాజాగా నిర్ణయించింది.
నేలలు అనుకూలమే
తెలంగాణ ఉద్యానశాఖ హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లా, తమిళనాడులోని ఊటీలో ఉన్న జాతీయ ఆలుగడ్డల పరిశోధన కేంద్రం(National Potato Reseach Center) శాస్త్రవేత్తలతో అధ్యయనం చేయించింది. యాసంగిలో ఈ పంట(Potato Cultivation in Telangana) సాగుకు అనుకూలమైన వాతావరణం, భూములు తెలంగాణలో ఉన్నట్లు వారు సిఫార్సు చేశారని ఉద్యానశాఖ అధికారులు తెలిపారు. ఆయా జిల్లాల్లోని నేలల్లో ఏ వంగడాలు సాగుచేస్తే ఎంత దిగుబడి వస్తుందో కూడా వివరించారని వెల్లడించారు. ‘‘మొత్తం ఏడు రకాల ఆలుగడ్డ వంగడాల సాగుకు ఇక్కడి నేలలు అనుకూలం. కుఫ్రీ సూర్య, కుఫ్రీ ఖ్యాతి, చంద్రముఖి, బాద్షా, పుఖ్రాజ్, జ్యోతి, చిప్సోన-3 అనే రకాలు సాగుచేయొచ్చు. ఆయా రకాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా. ఎకరానికి 200 నుంచి 400 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వీటిలో పుఖ్రాజ్ రకం వంగడంతో పలు రాష్ట్రాల్లో గరిష్ఠంగా హెక్టారుకు 400 క్వింటాళ్ల దిగుబడి లభించింది. తెలంగాణలోనూ అదే స్థాయిలో పండుతుందని’’ జాతీయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త పాండే ‘ఈనాడు’కు వివరించారు.
ఏడాదంతా గిరాకీ
సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెలంగాణ భూముల్లో ఎకరానికి 120 క్వింటాళ్లకు పైగా దిగుబడి లభిస్తుందని తమ అధ్యయనంలో తేలిందని ఉద్యాన శాఖ సంచాలకుడు వెంకట్రాంరెడ్డి వెల్లడించారు. వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ తదితర జిల్లాల్లో దీన్ని విరివిగా పండించవచ్చన్నారు. విత్తన గడ్డ(Potato Cultivation in Telangana) కోసం రూ.110 కోట్లు కావాలని, జాతీయ పరిశోధన సంస్థ విత్తనాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపిందని వెల్లడించారు. కేవలం 16 వేల ఎకరాల్లో అదనంగా సాగుచేసినా రూ.500 కోట్లకుపైగా పంట చేతికొస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా వందకోట్లకుపైగా ప్రజలు నిత్యాహారంలో దీనిని వినియోగిస్తున్నందున ఏడాది పొడవునా పంటకు గిరాకీ ఉంటుందన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా డీపీఆర్సీ భవనంలో ఆలూ సాగుపై నిర్వహించిన ‘రైతుల అవగాహన సదస్సు’లోనూ ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ఆలుగడ్డ దిగుబడులు(Potato Cultivation in Telangana) సాధించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధంచేస్తున్నట్టు చెప్పారు.