ETV Bharat / city

కోఠి కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చే దిశగా సర్కార్​ అడుగులు.. - మహిళా విశ్వవిద్యాలయం

Sabitha indra reddy On Koti women's College: కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే అంశంపై తన కార్యాలయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చితే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కూలంకుశంగా పరిశోధించి ఒక నివేదిక రూపొందించాలని సూచించారు.

Telangana Government steps to transform Koti College into a Women's University

author img

By

Published : Jan 18, 2022, 9:30 PM IST

Sabitha indra reddy On Koti women's College: త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలను రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే అంశంపై తన కార్యాలయంలో విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ ఉమర్ జలీల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ విజులత తదితరులు పాల్గొన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండి యూజీసీ స్వయం ప్రతిపత్తి, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రభుత్వం భావించిందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటును వేగవంతం చేసే దిశగా పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కోఠి మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చితే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థుల వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కూలంకుశంగా పరిశోధించి ఒక నివేదిక రూపొందించాలని సూచించారు. మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటకు విధి విధానాలు, అనుమతుల గురించి వివరాలు అందించాలని... ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖలో అంతర్గతంగా కమిటీ వేసుకోవాలని చెప్పారు.

ప్రస్తుతం ఈ మహిళా కళాశాలలో 4,159 మంది విద్యార్థినులు చదువుతున్నందున మహిళా వర్సిటీగా మార్చితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా... అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కోఠి మహిళా కళాశాలకు చారిత్రాత్మక వైభవం ఉండటంతో మహిళా విశ్వవిద్యాలయంగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో మహర్ధశ వస్తుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోందని... కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయం వల్ల మరింత పేరు, ప్రఖ్యాతులు వస్తాయని వివరించారు. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి సబితా ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.