ETV Bharat / city

'ప్రైవేట్​కు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి' - Interstate bus services latest news

అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను ప్రైవేట్​కు ఇచ్చే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. కొత్త బస్సులు కొనడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని విన్నవించింది.

Telangana Government should withdraw proposal to privatize Bus Services
'ప్రైవేట్​కు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి'
author img

By

Published : Sep 13, 2020, 10:57 PM IST

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అంతర్రాష్ట్ర ఒప్పందాలు చేసుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఏపీఎస్​ ఆర్టీసీ 2.64 లక్షల కిలో మీటర్లు తిప్పుతోందని... అదే విధంగా ఏపీలో తెలంగాణ ఆర్టీసీ 1.52 లక్షల కిలో మీటర్లు తిప్పుతోందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం ప్రకారం లక్ష కిలోమీటర్లు పెంచుకోవడానికి తెలంగాణకు అవకాశం ఉందని తెలిపారు.

తెలంగాణ ఆర్టీసీకి లాభాలు వచ్చే అంతరాష్ట్ర సర్వీసులను ప్రైవేటు వారికి ఇచ్చే ప్రతిపాదన ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్​ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని కోరారు. కొత్త బస్సులు కొనడానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని విన్నవించారు. అంతర్రాష్ట్ర ఒప్పందాన్ని గౌరవిస్తూ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీని బలోపేతం చేస్తూ... ప్రజా రవాణా వ్యవస్థను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.

'ప్రైవేట్​కు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి'

ఇవీచూడండి: ఈ నెల 15న తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.