కొవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి సరఫరా, పంపిణీ వంటి అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్టీరింగ్ కమిటీతో పాటు రాష్ట్ర, జిల్లా, మండలస్థాయుల్లో టాస్క్‌ఫోర్స్‌లను నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్టీరింగ్ కమిటీలో వివిధ శాఖల కార్యదర్శులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రైల్వే, రక్షణ విభాగంతో పాటు ఇతరులు సభ్యులుగా ఉంటారు. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి.. ఈ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
వ్యాక్సిన్ పంపిణీకి అవసరమైన డేటాబేస్ సిద్ధం చేయడం, వ్యవస్థ ఏర్పాటు, వసతులు, ఆర్థిక పరమైన ఏర్పాట్ల పర్యవేక్షణ, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత.. పంపిణీ, అమలు, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి చర్యలను స్టీరింగ్ కమిటీ చేపడుతుంది.
పరిస్థితులు, అవసరాలకు అనుగుణంగా సిబ్బంది సాయంతో రాష్ట్ర, జిల్లా, మండలస్థాయి టాస్క్‌ఫోర్స్ విభాగాలు వ్యాక్సిన్ పంపిణీ పటిష్ఠంగా జరిగేలా చూడాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.