రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ సజీవదహనం ఘటనలో గాయపడిన అటెండర్ చంద్రయ్యకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. సీఎం సహాయ నిధి నుంచి చంద్రయ్య చికిత్స కోసం రూ.6 లక్షలు విడుదల చేసింది.
తహసీల్దార్ విజయారెడ్డిని రక్షించేందుకు యత్నించి అటెండర్ చంద్రయ్య గాయపడ్డారు. పదిరోజులుగా అపోలో డీఆర్డీవో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
![telangana government released 6 lakhs to attender chaindraiah from cm relief fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5063001_cm.jpeg)