Lessons in Telugu and English : రాష్ట్రంలోని సర్కారు బడుల్లో ఈ ఏడాది నుంచి 1-8 తరగతుల విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం.. పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే బోధనే కాకుండా.. బోధించాల్సిన పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంది. ఒకేసారి ఇంగ్లీష్ మీడియం అనగానే పిల్లలు ఒత్తిడికి గురవుతారని.. అర్థంకాక ఇబ్బంది పడతారని గ్రహించిన ప్రభుత్వం అలాంటి సమస్యలు రాకుండా వినూత్న ప్రయత్నం చేసింది.
పుస్తకంలో ఒక వైపు ఆంగ్లంలో.. మరో వైపు తెలుగులో పాఠ్యాంశం ఉండేలా అధికారులు ముద్రించారు. ఇలా చేయటం వల్ల.. పిల్లలకు పాఠ్యాంశం సులభంగా అర్థం కావటమే కాకుండా.. వారిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటుందని భావిస్తున్నారు. ఈ పుస్తకాలను సోమవారం నుంచి విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.