ETV Bharat / city

Land Details: భూముల వివరాలు ఇవ్వాలని కలెక్టర్లకు సర్కారు ఆదేశం..!

రాష్ట్రంలోని సీలింగ్​ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సర్కారు ఆదేశించింది. అత్యంత ప్రాధాన్యకరంగా పరిగణించి సమాచారం, వివరాలను పంపాలని జిల్లా కలెక్టర్లకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు.

Telangana Government orders to collectors for give details of lands

author img

By

Published : Nov 5, 2021, 9:37 PM IST

సీలింగ్ భూములు, అసైన్డ్ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూములకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘానికి అందించేందుకు వీలుగా ఈ వివరాలు ఇవ్వాలని పురపాలకశాఖ తెలిపింది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మంత్రులు హరీశ్​రావు, తలసాని శ్రీనివాస్​యాదవ్​, ఎర్రబెల్లి దయాకర్​రావు, శ్రీనివాస్​గౌడ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో రాష్ట్ర ప్రభుత్వం గతంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

ఎల్ఆర్ఎస్​తో పాటు ప్లాట్లు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠాలు, ఇతర అంశాలపై సబ్ కమిటీ ఏర్పాటైంది. ఉపసంఘం పరిశీలన కోసం సంబంధిత భూముల వివరాలు ఇవ్వాలని పురపాలకశాఖ కలెక్టర్లను ఆదేశించింది. సీలింగ్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, గ్రామకంఠం భూములతో పాటు కోర్టు కేసులు ఉన్న, నిషేధిత జాబితాలోని భూముల వివరాలు ఇవ్వాలని కోరింది. దాంతో పాటు 166, 58, 59 జీఓలకు అనుగుణంగా వచ్చిన దరఖాస్తులు, వాటి వివరాలు కూడా అందించాలని కోరింది. అత్యంత ప్రాధాన్యకరంగా పరిగణించి సమాచారం, వివరాలను పంపాలని జిల్లా కలెక్టర్లకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.