ETV Bharat / city

Dharani Portal:ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలుంటే.. వాట్సాప్ చేయండి

ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ప్రభుత్వం వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిద్వారా తమ ఫిర్యాదులు అందజేయాలని సూచించింది.

dharani portal, dharani portal issues
ధరణి పోర్టల్, వాట్సాప్​లో ధరణి ఫిర్యాదులు
author img

By

Published : Jun 5, 2021, 12:49 PM IST

ధరణి పోర్టల్ సంబంధింత సమస్యలు, ఫిర్యాదులు సమర్పించేందుకు ఫ్రభుత్వం ఓ వాట్సాప్ నంబర్, ఈ-మెయిల్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9133089444, Ascmro@Telangana.gov.in ద్వారా ఫిర్యాదులు పంపించాలని సీఎస్, భూ పరిపాలన చీఫ్ కమిషనర్ సోమేశ్ కుమార్ తెలిపారు.

సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏ, రిజిష్ట్రేషన్లు, ఐటీ విభాగాల అధికారులు ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం రోజున.. ధరణి పోర్టల్ సమస్యలపై సీసీఎల్ఏ, సీఎస్ సోమేశ్ కుమార్ నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.