sanitation workers honorarium: పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పురపాలికల్లోని సిబ్బందికి గౌరవవేతనాన్ని 30శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పొరుగుసేవల పద్ధతిన ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న 22,533 మందితో పాటు 7,271 మంది ఇతరులు.. అంటే మొత్తం 29,804 మందికి వేతనాలను పెంచారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను పురపాలకశాఖ సంచాలకులు సత్యనారాయణ ఆదేశాలిచ్చారు.
ఇదీచూడండి: ఆశా వర్కర్లకు శుభవార్త.. నెలవారీ ప్రోత్సాహకాలు పెంపు