ETV Bharat / city

మరో అడుగు... ప్లాస్టిక్​ నిషేధంపై అధ్యయనానికి కమిటీ

author img

By

Published : Nov 7, 2019, 7:35 PM IST

రాష్ట్రవ్యాప్తంగా నింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ నిషేధంపై అధ్యయనానికి కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

ప్లాస్టిక్​ నిషేధంపై అధ్యయనానికి కమిటీ

రాష్ట్రంలో ప్లాస్టిక్​ నిషేధం దిశగా ముందడుగు పడింది. సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ నిషేధంపై అధ్యయనానికి అధికారుల కమిటీ ఏర్పాటుచేస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గ నిర్ణయం మేరకు ఈ జీవో విడుదల చేసింది. అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన.. పురపాలక, పంచాయతీరాజ్​, పరిశ్రమల శాఖల ముఖ్యకార్యదర్శులు, వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్​ ఇందులో సభ్యులుగా ఉంటారు. మెంబర్​ కన్వీనర్​గా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిని నియమించారు.

కమిటీ పనేంటంటే...

ప్లాస్టిక్​ వాడకం వల్ల వచ్చే అనర్థాలు, ప్రత్యామ్నాయాలపై ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నియమకాలపైనా వీరు దృష్టి సారించనున్నారు. ప్లాస్టిక్​ ప్రత్యామ్నాయ ఉత్పత్తుల పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపైనా ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.

ఇవీచూడండి: మేడారం జాతర ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

Intro:Body:

Tg_Hyd_56_07_Committee_On_Plastic_Dry_3053262

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.