ETV Bharat / city

ప్రాజెక్టుల స్వాధీనానికి గోదావరి బోర్డు నోట్.. తెలంగాణ అభ్యంతరం - central gazette on projects

పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టుల సిబ్బంది, ఆస్తుల వివరాలను ప్రభుత్వం అనుమతి లేకుండా ఇవ్వలేమని జీఆర్ఎంబీ ఉపసంఘం ఎదుట తెలంగాణ అధికారులు తేల్చిచెప్పారు. అటు గెజిట్​ నోటిఫికేషన్​లో పేర్కొన్న అన్ని తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది.

GRMB NEWS
GRMB Sub Commitee Meeting
author img

By

Published : Nov 17, 2021, 10:39 PM IST

చొక్కారావు ఎత్తిపోతల పంప్​హౌస్, కాకతీయ కాల్వ క్రాస్​ రెగ్యులేటర్​ స్వాధీనం కోసం గోదావరి నదీ యాజమాన్య బోర్డు సిద్ధం చేసిన నోట్​పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవాళ జరిగిన జీఆర్ఎంబీ ఉపసంఘం సమావేశంలో (GRMB Sub Committee Meeting) తెలంగాణ అధికారులు ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే నేతృత్వంలో జలసౌధలో ఉపసంఘం సమావేశం జరిగింది.

ఆ నోట్​పై చర్చించలేం..

చొక్కారావు ఎత్తిపోతల పంప్​హౌస్​, కాకతీయ కాల్వ క్రాస్​ రెగ్యులేటర్, తొర్రిగెడ్డ, చాగల్నాడు ఎత్తిపోతల పథకాల స్వాధీనం ఎజెండాగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నాలుగింటి స్వాధీనం కోసం గోదావరి బోర్డు నోట్​ సిద్ధం చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన తెలంగాణ అధికారులు... ఉప సంఘంతో సంబంధం లేకుండా ప్రాజెక్టులను ఎలా సందర్శిస్తారని ప్రశ్నించారు. స్వాధీనం నోట్​పై తాము చర్చించబోమని, సమయం కావాలని కోరారు. పెద్దవాగు ప్రాజెక్టు స్వాధీనానికి (GRMB Sub Committee Meeting) మాత్రమే బోర్డు అంగీకరించిందని... ఇతర ప్రాజెక్టుల స్వాధీనం విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవని స్పష్టం చేశారు. పెద్దవాగు మినహా ఇతర ప్రాజెక్టుల సిబ్బంది, ఆస్తుల వివరాలను ప్రభుత్వం అనుమతి లేకుండా ఇవ్వలేమని అన్నారు.

సీఐఎస్​ఎఫ్​ భద్రత అవసరం లేదు..

ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన గోదావరి ఎత్తిపోతల, ఎస్సారెస్పీ ద్వారా కృష్ణా బేసిన్​కు నీటి తరలింపునకు అభ్యంతరం చెప్పలేదని.. ఇప్పుడు కూడా ఏపీకి అభ్యంతరాలు అవసరం లేదని తెలంగాణ అధికారులు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించాల్సిన అవసరం లేదన్న తెలంగాణ.. గోదావరిపై ఉమ్మడి ప్రాజెక్టులు లేనందున భద్రతాపరమైన సమస్యలు ఏవీ లేవన్నారు.

తెలంగాణ స్వాధీనం చేస్తేనే..

అటు గెజిట్​ నోటిఫికేషన్​లో పేర్కొన్న అన్ని తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే తమ ప్రాజెక్టులను అప్పగించేందుకు సిద్ధమని ఏపీ అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉపసంఘం సమావేశం వాయిదా పడింది. రెండు రాష్ట్రాల అధికారులు చర్చించుకొని తదుపరి సమావేశం తేదీని సూచించాలని బోర్డు తెలిపింది. నెలాఖర్లో మళ్లీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

ఇదీచూడండి: CM KCR Letter to PM: ఎంత కొంటారో చెప్పండి.. ప్రధానికి కేసీఆర్‌ లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.