తమిళిసై సౌందరరాజన్... తెలంగాణ గవర్నర్గా నియమితులైన సందర్భంగా ఈరోజు తన తండ్రి.. కాంగ్రెస్ నేత అనంతన్ ఆశీస్సులు తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు సేవచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని అమె తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. తండ్రి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై అధ్యయమం చేసి పరిష్కారించేందుకు కృషి చేస్తానని చెప్పారు. తమిళిసై ఈనెల 6న రాష్ట్రానికి రానున్నట్టు సమాచారం. సెప్టెంబర్ 7న తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయునన్నట్లు తెలిసింది.
- ఇదీ చూడండి : మన కొత్త గవర్నర్ తమిళిసై ప్రస్థానమిదీ...