రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. 2020-21 ఆర్థిక ఏడాదికి చెల్లించాల్సిన ఆస్తి పన్నులో మే 31 తేదీలోపు చెల్లించిన వారికి 5 శాతం రిబేటు కల్పిస్తూ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పాత బకాయిలతో పాటు ఈ ఏడాది ఆస్తిపన్ను కూడా చెల్లించి రిబేటు పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఏడాదికి రూ.30 వేల లోపు ఆస్తిపన్ను ఉన్న నివాస యాజమాన్యాలకు మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇవీచూడండి: ఎంత దూరమైనా రైల్ టికెట్ 50రూపాయలే.!