ETV Bharat / city

ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త స్టేషన్ల ఏర్పాటు

author img

By

Published : Jul 12, 2020, 10:49 AM IST

పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రంలో ఎక్సైజ్‌ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులు భావించారు. ఈ ప్రతిపాదనల ఆమోదానికి కీలకమైన ఆర్థిక శాఖ అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. కొత్త స్టేషన్లతోపాటు అధికారుల పోస్టుల పెంపు అంశంలో ఈ శాఖ అనుమతే కీలకం కావడంతో అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లే అని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యారూపం దాల్చుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

telangana excise
telangana excise

తెలంగాణ ఆబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు తుది దశకు చేరుకుంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎక్సైజ్‌ స్టేషన్ల పెంపుదలతో పాటు ఉన్నతస్థాయిలోనూ అధికారుల పోస్టులను పెంచేందుకు చేసిన ప్రతిపాదనల దస్త్రం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇదివరకే పంపిన ఈ ప్రతిపాదనల ఆమోదానికి కీలకమైన ఆర్థిక శాఖ అనుమతులు లభించినట్లు తెలుస్తోంది. కొత్త స్టేషన్లతోపాటు అధికారుల పోస్టుల పెంపు అంశంలో ఈ శాఖ అనుమతే కీలకం కావడంతో అడ్డంకులు దాదాపు తొలగిపోయినట్లే అని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే ఈ ప్రతిపాదన కార్యారూపం దాల్చుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే రాష్ట్రంలో 25 వరకు ఎక్సైజ్‌ ఠాణాలు పెరిగేందుకు అవకాశం ఉంది.

కొత్త స్టేషన్లు

ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోనే ఎక్కువగా కొత్త స్టేషన్లు రానున్నాయి. సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, శంషాబాద్‌, మేడ్చల్‌, ఘట్‌కేసర్‌, కీసర, శామీర్‌పేట, దుండిగల్‌, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ.. తదితర ప్రాంతాల్లో జనాభా పెరుగుదల దృష్ట్యా ఆయా ప్రాంతాలతో కూడిన ఠాణాలను రెండుగా విభజించనున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతాల్లో జనాభా పెరుగుతున్న కారణంగా ఎక్సైజ్‌ ఠాణాల పరిధి విస్తృతమైంది. ఈ క్రమంలో మద్యం దుకాణాల పర్యవేక్షణపై ప్రస్తుతం ఉన్న సిబ్బందితో అజమాయిషీ కొరవడుతోంది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్‌ శాఖను పునర్వ్యవస్థీకరించాలని ఉన్నతాధికారులు భావించారు.

త్వరలోనే పూర్తి స్థాయి అనుమతులు

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి స్టేషన్లనే ఇప్పటికీ కొనసాగిస్తుండటంతో గత ఏడాది అధికారుల పోస్టులు, స్టేషన్ల పెంపు అంశాలతో కూడిన ప్రతిపాదనల్ని పంపించారు. దీనికి సంబంధించి తాజాగా ఆర్థిక శాఖ అనుమతి లభించడంతో త్వరలోనే పూర్తిస్థాయి అనుమతులు రావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్న 284 మంది ఎస్సైలు మరికొద్ది రోజుల్లోనే పోస్టింగ్‌ల్లో చేరనుండటంతో కొత్త స్టేషన్లనూ ఏర్పాటు చేసే అవకాశముంటుందని యోచిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఎస్సైలకు సంబంధించి 87 సూపర్‌ న్యూమరరీ పోస్టులనూ మంజూరు చేసిన నేపథ్యంలో కొత్త ప్రతిపాదనకూ త్వరలోనే మోక్షం లభిస్తుందనే చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 1,178 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.