Telangana letter to KRMB: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ టెండర్‌పై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఈ నెల 6న ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్‌పై కేఆర్‌ఎంబీకి ఈఎన్‌సీ ఫిర్యాదు చేశారు. కృష్ణా బేసిన్ నుంచి నీటిని ఇతర బేసిన్లకు తరలించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ చేపట్టే పని తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను కాలరాసినట్లవుతుందని పేర్కొన్నారు.
శ్రీశైలం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి తీసుకోవద్దని ఈఎన్‌సీ లేఖలో కోరారు. 2014 తర్వాత చేపట్టే ప్రాజెక్టులు విభజన చట్టానికి లోబడే ఉండాలన్న మురళీధర్.. టెండర్లను ఏపీ కొనసాగించకుండా ఆపాలని కేఆర్‌ఎంబీని కోరారు.
ఇవీ చదవండి: గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ప్రభుత్వం లేఖ
ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పర్యటన
అందులో నటించనన్న సాయిపల్లవి.. బొమ్మరిల్లు భాస్కర్‌తో చైతూ మూవీ!