ఎన్నికల నెపంతో రాష్ట్ర సర్కార్ పీఆర్సీని వాయిదా వేస్తూ వచ్చిందని.. ప్రస్తుతం ఎన్నికల తంతు ముగిసినందున పీఆర్సీని ప్రకటించాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. హైదరాబాద్ కోఠిలోని ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకుల కార్యాలయం వద్ద సంఘం నాయకులు ధర్నా చేశారు.
తమది ఉద్యోగుల స్నేహపూరిత ప్రభుత్వమని చెప్పుకుంటున్న కేసీఆర్.. ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని పీఆర్సీ, పెండింగ్ డీఏలను ప్రకటించాలని, లేని పక్షంలో ఐక్య పోరాటం చేస్తామని హెచ్చరించారు.
- ఇదీ చూడండి : 'దర్యాప్తు పూర్తి కాకుండా.. ఎలా జోక్యం చేసుకోవాలి'