ETV Bharat / city

భారీ వర్షం కురిసినా.. విద్యుత్​ సరఫరాకు అంతరాయం లేకుండా.. - many sub stations submerged under floods in hyderabad

భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది. పలు సబ్​స్టేషన్లలోకి నీళ్లు చేరాయి. చాలా ట్రాన్స్​ఫార్మర్లు నీటిలో కొట్టుకుపోయాయి. విద్యుత్​ స్తంబాలు విరిగిపోయాయి. రూ.5 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపై ఇలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు సబ్​స్టేషన్లు నీటిలో మునగకుండా ఉండేందుకు విద్యుత్ శాఖ వినూత్నంగా ఆలోచించింది.

telangana electricity department
భారీ వర్షం కురిసినా.. విద్యుత్​ సరఫరాకు అంతరాయం లేకుండా..
author img

By

Published : Oct 19, 2020, 5:29 AM IST

Updated : Oct 19, 2020, 6:02 AM IST

హైదరాబాద్​లో భారీ వర్షం వస్తే చాలు.. చాలా ప్రాంతాలు జలమయమైపోతాయి. ఇటీవల కురిసిన కుండపోత వానలకు ఎస్పీడీసీఎల్ పరిధిలో సుమారు 15 సబ్​స్టేషన్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో 2 సబ్​స్టేషన్లలోకి వరద నీరు వచ్చి చేరింది. చాలా చోట్ల స్తంబాలు విరిగిపోయాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వందల ట్రాన్స్​ఫార్మర్లు నీటిలో కొట్టుకుపోయాయి. విద్యుత్ శాఖకు రూ.5 కోట్ల వరకు నష్టం వాటిల్లింది.

భారీ వర్షాలు కురిసినప్పుడు అపార్ట్​మెంట్ల సెల్లార్లలోకి నీరు చేరుతోంది. ఫలితంగా రోజుల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. అదే సమయంలో సబ్​స్టేషన్లలోకి నీరు వచ్చి చేరుతుంది. దీన్ని నివారించేందుకు విద్యుత్ శాఖ అధికారులు ఓ ఉపాయాన్ని ఆలోచించారు.

భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి నీటిని తోడే మోటార్లకు డిమాండ్ ఉంటుంది. సకాలంలో మోటార్లు దొరక్క సబ్​స్టేషన్లలోని నీటిని తోడడం అధికారులకు సవాల్​గా మారిపోతుంది. దీనిని అదిగమించేందుకు సొంతంగా సుమారు 20 డీజిల్ మోటార్లను కొనుగోలు చేసింది విద్యుత్​ శాఖ. గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని సరూర్​నగర్ డివిజన్, అస్మాన్ ఘట్​ డివిజన్, చార్మినార్​ డివిజన్​లోని ఫలక్​నుమా, సలాల, బాలాపూర్​, దుర్గం చెరువు, పల్లె చెరువు, రాజేంద్రనగర్​, మొహదీపట్నం, అత్తాపూర్​, టోలీచౌక్, ఇండోర్ సబ్​స్టేషన్లయిన నిమ్స్, ఆర్ఆర్​కోర్టు సబ్​స్టేషన్లలో వీటిని అందుబాటులో ఉంచారు. ఎంత నీరు చేరినా.. వెంటనే తోడి.. విద్యుత్​ పునరుద్దరణకు చర్యలు తీసుకోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి: జల దిగ్భందమైన హయత్​నగర్ సబ్​ స్టేషన్

Last Updated : Oct 19, 2020, 6:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.