రాష్ట్రంలో బుధవారం 49 కోరనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వైద్య ఆరోగ్య శాఖ వద్ద కేవలం 535 శాంపిళ్లు మాత్రమే పరీక్ష చేయాల్సి ఉందని... దాదాపు కరోనా అనుమానం ఉన్న అందరికీ పరీక్షలు పూర్తైనట్టు అవుతుందని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కోరనా సోకిన వారి సంఖ్య 453కి చేరింది. వీరిలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసులు 397కాగా.. మరో 45మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జుకాగా.. 11మంది మృతి చెందారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎవరూ ఐసీయూలో లేరని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జిల్లాల వారీగా కరోనా కేసులు ఇలా ఉన్నాయి.
ఇదీ చూడండి: కరోనా మానసిక ఆందోళనను ఇలా జయించండి