ETV Bharat / city

Telangana Debts: ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ చేసిన అప్పు ఎంతంటే?

Telangana Debts: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ రుణం నలభై వేల కోట్ల మార్కు దాటుతోంది. ఇప్పటికే 39 వేల కోట్లు అప్పుగా తీసుకున్న సర్కార్... తాజాగా మరో రెండు వేల కోట్లకు బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి నెలలోనే తీసుకున్న అప్పు ఆరువేల కోట్ల రూపాయలు దాటనుంది.

Telangana Debts
Telangana Debts
author img

By

Published : Jan 14, 2022, 4:22 PM IST

Telangana Debts: కొవిడ్ మహమ్మారి వల్ల అన్ని రంగాల కార్యకలాపాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయా రంగాల్లో లావాదేవీలు తగ్గడంతో సర్కార్ ఖజానాకు వచ్చే ఆదాయం తగ్గింది. దీంతో నిధుల సమీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రుణపరిమితి చట్టానికి (FRBM) లోబడి రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్​లో రుణాలు తీసుకోవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి - జీఎస్డీపీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకోవచ్చు. అందుకు అనుగుణంగా 2021 - 22 ఆర్థికసంవత్సరంలో 47,500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో ప్రతిపాదించింది.

జనవరి నెలలో ఎంతంటే?

ఇప్పటి వరకు 39,036 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొంది. దానికి అదనంగా తాజాగా మరో రెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం రుణంగా తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2000 కోట్ల రూపాయల విలువైన బాండ్లను రిజర్వ్ బ్యాంకు ద్వారా వేలం వేయనుంది. 12 ఏళ్ల కాలపరిమితికి బాండ్లను విక్రయించనుంది. ఈ బాండ్లను ఆర్బీఐ ఈ నెల 18న వేలం వేయనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ రుణం 41వేల కోట్ల రూపాయలు దాటనుంది. జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే రుణం ఆరు వేల కోట్ల రూపాయలు అవుతుంది.

పంట పెట్టుబడి సాయంగా

ఈ నెల నాలుగో తేదీన 1,187 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న సర్కార్... పదకొండో తేదీన మరో 3000 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొంది. తాజాగా 2000 కోట్ల రుణం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. యాసంగి సీజన్ రైతుబంధు సాయాన్ని గత నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ సీజన్​లో పంట పెట్టుబడి సాయంగా రైతుల ఖాతాల్లో 7,500 కోట్ల రూపాయల నగదు జమ చేయనున్నారు. ఇప్పటి వరకు ఆరువేల కోట్లకు పైగా చెల్లింపులు చేశారు.

అందుకోసమే ఎక్కువ నిధులు

ఉద్యోగుల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులు, రుణాలు, వడ్డీల చెల్లింపుల నేపథ్యంలో ఈ నెలలో ప్రభుత్వం ఎక్కువ నిధులు సమకూర్చుకోవాల్సి వచ్చింది. అందుకోసం రుణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఆరువేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకునే వెసులుబాటు ఉంది.

ఇవీ చదవండి : రాష్ట్రానికి వచ్చిన ఆదాయం, చేసిన వ్యయం, అప్పుల వివరాలివిగో..

Telangana Loan: మరో మూడు వేల కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.