గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నేటి నుంచి ప్రారంభించిన కరోనా రెండో డోస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సూచించారు. నగరంలోని రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని సన్‌రైజ్ హోమ్ కాలనీలో ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాన్ని సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే మూడు కోట్లకు పైగా కొవిడ్ వ్యాక్సిన్లను అందచేశామని సీఎస్ తెలిపారు. కరోనా నివారణకు కేవలం వ్యాక్సిన్ తీసుకోవడమే మార్గమని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 90 శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ చేశామన్నారు.. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ. నేటి నుంచి పది రోజులపాటు 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ వేస్తున్నట్లు వివరించారు. నగరంలో రెండు, మూడు కాలనీలకు ఒక మొబైల్ వ్యాక్సిన్ కేంద్రం వద్ద టీకా పంపిణీ చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. రోజూ దాదాపు 450 కాలనీలను కవర్ చేస్తామన్నారు. అవసరమైతే వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరికొన్ని రోజులు పొడిగిస్తామని పేర్కొన్నారు.
-
Chief Secretary @SomeshKumarIAS along with @TelanganaHealth Secretary S.A.M. Rizvi and @GHMCOnline Commissioner Lokesh Kumar today visited Mobile 2nd Dose #Covidvaccination Centre at Sun Rise Home Colony Park in Rajendra Nagar. pic.twitter.com/P5ZR34dUzS
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) October 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Chief Secretary @SomeshKumarIAS along with @TelanganaHealth Secretary S.A.M. Rizvi and @GHMCOnline Commissioner Lokesh Kumar today visited Mobile 2nd Dose #Covidvaccination Centre at Sun Rise Home Colony Park in Rajendra Nagar. pic.twitter.com/P5ZR34dUzS
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) October 30, 2021Chief Secretary @SomeshKumarIAS along with @TelanganaHealth Secretary S.A.M. Rizvi and @GHMCOnline Commissioner Lokesh Kumar today visited Mobile 2nd Dose #Covidvaccination Centre at Sun Rise Home Colony Park in Rajendra Nagar. pic.twitter.com/P5ZR34dUzS
— Office of Chief Secretary, Telangana Govt. (@TelanganaCS) October 30, 2021
ఇదీచూడండి: చిన్నారులకు ఫైజర్ టీకా పంపిణీకి ఆమోదం