అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరిని డిసెంబర్ 31 నాటికి ఈ-శ్రమ్ పోర్టల్‌లో (telangana cs review on e shram)నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. కార్మిక, సంబంధిత శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన సీఎస్.. నమోదు ప్రక్రియపై ఆరా తీశారు.
ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకునేలా కార్మికులను సిటిజన్ సర్వీస్ సెంటర్లకు తరలించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలని తెలిపారు. జిల్లా, గ్రామం, వార్డు స్థాయిల్లో కార్మికులకు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలని.. అన్ని స్థాయిల్లోనూ నమోదు వేగంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని సీఎస్ సూచించారు. జిల్లా స్థాయి కమిటీలు నిర్దిష్ట గడువులోగా ప్రక్రియను (telangana cs review on e shram)పూర్తి చేసేలా రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్రస్థాయి నోడల్ అధికారులు సమన్వయం చేయాలని ఆదేశించారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదుపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత రంగ కార్మికులకు కల్పిస్తున్న ప్రయోజనాలను వివరించాలని చెప్పారు.
ఈ-శ్రమ్ పథకం కింద అసంఘటిత రంగ కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రెండు లక్షలు, వికలాంగులైతే లక్ష రూపాయలు చెల్లిస్తారని సోమేశ్ కుమార్ వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి పర్యవేక్షక కమిటీ, కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు.
ఇవీచూడండి: TRS vs Farmers: సభకు పొలాలు ఇవ్వమన్నందుకు రైతులపై తెరాస నాయకుడు దాడి