ETV Bharat / city

కొత్తగా ఏ వైరస్​ వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధం: సోమేశ్​కుమార్​

రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో "కొవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాలు- భవిష్యత్తు కార్యచరణ" అనే అంశంపై నిర్వహించిన వెబినార్​లో సీఎస్ సోమేశ్​కుమార్​ పాల్గొన్నారు. మూడో దశను ఎదుర్కునేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధంగా ఉందని సీఎస్​ స్పష్టం చేశారు.

Telangana cs somesh kumar about  precautions for corona third wave

author img

By

Published : Jun 16, 2021, 4:57 AM IST

రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర వైద్య మండలి ఆధ్వర్యంలో "కొవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాలు... భవిష్యత్తు కార్యచరణ" అనే అంశంపై నిర్వహించిన వెబినార్​లో బీఆర్కే భవన్ నుంచి సీఎస్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించి వైద్యులు, రోగుల్లో మనోస్థైర్యం నింపారని సీఎస్​ పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎయిమ్స్ వైద్యులు డాక్టర్ గులేరియా, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి, కాళోజి వర్శిటీ వీసీ కరుణాకర్ రెడ్డి, డీఎంఈ రమేశ్​ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కేసులు తగ్గడానికి సీఎం మార్గదర్శకాలే కారణమని ఈ సందర్భంగా సీఎస్ వివరించారు. మూడో వేవ్ ఎదుర్కోవడం కోసం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచినట్టు వివరించారు.

ఇదీ చూడండి: CJI: సీజేఐకి గ్రీన్​ ఛాలెంజ్​... రాజ్​భవన్​లో మొక్క నాటిన జస్టిస్ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.