పార్లమెంట్‌లో గాంధీ విగ్రహం ముందు రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరసన తెలిపారు. దిశకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ ఇప్పటి వరకు దిశ కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని చెప్పారు. షీ టీమ్స్ అంటూ ప్రకటనలు తప్ప చేసిందేమీ లేదని అన్నారు. రాజకీయ నాయకులను కట్టడి చేయడానికి పోలీసులను వాడుతున్నార ఆరోపించారు. మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ఇది సమంజసం కాదన్నారు. నిరసనలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఆర్.సి.కుంతియా పాల్గొన్నారు.
ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'