ETV Bharat / city

congress meet governor: 'వరి కొనుగోలు చేయమన్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి' - t congress speaks on farmers problems

తెలంగాణ కాంగ్రెస్​ నేతలు గవర్నర్​తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో రైతుల ఇబ్బందులు, పంట నష్టాలు, ప్రత్యామ్నాయాలపై వినతిపత్రం అందించారు. ధాన్యం కొనుగోళ్లపై 12న దిల్లీలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

congress meet governor
congress meet governor
author img

By

Published : Dec 1, 2021, 7:03 PM IST

Updated : Dec 1, 2021, 7:22 PM IST

రాష్ట్రంలో రైతులు పండించిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయి పర్యటన చేసి రైతుల గోడును స్వయంగా పరిశీలన చేయాలని గవర్నర్‌ తమిళసైకి కాంగ్రెస్‌ బృందం విజ్ఞప్తి చేసింది. ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్​రెడ్డి, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, రాష్ట్ర ఛైర్మన్‌ అన్వేష్‌ రెడ్డి, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షులు వేం నరేందర్​రెడ్డి, సీనియర్‌ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతురావు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. మూడు పేజీల వినతపత్రాన్ని గవర్నర్‌కు అందించారు.

రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, డబ్బులు తక్షణమే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్​ను కోరినట్లు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు చెప్పారు. పంటల సాగు విషయంలో రైతులను కట్టడి చేస్తే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. మూడు చట్టాలను వాపస్ తీసుకున్నట్లు.. యాసంగి వరి పంటను కొనుగోలు చేయమన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేంతవరకు ఆందోళన చేపడతామని తెలిపారు.

రైతులకు నీళ్లు ఇచ్చానంటున్న కేసీఆర్.. పండించిన పంటలను ఎందుకు కొనరని ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను.. పార్టీలో చేర్చుకొని.. అసెంబ్లీలోనూ, బయట కూడా మాట్లాడకుండా చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఎట్లా గెలవాలని చూశారే.. తప్ప రైతుల గురించి ఆలోచించలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌కు గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలవాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై ఈనెల 12న ధర్నా చేస్తామని.. కేసీఆర్‌, బండి సంజయ్‌ కూడా పాల్గొనాలని సీనియర్‌ నేత హనుమంతరావు డిమాండ్‌ చేశారు.

congress meet governor: 'వరి కొనుగోలు చేయమన్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలి'

ఇవీచూడండి Farmer Suicide in mulugu: ధాన్యం కుప్ప వద్దే మరో రైతు ఆత్మహత్య..

Last Updated : Dec 1, 2021, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.