గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ మహ్మాతుడికి నివాళి అర్పించారు. ప్రార్థన, అభ్యర్థన, నిరసనతో గాంధీ పోరాట మార్గాన్ని చూపారన్నారు. సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన గాంధీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. అహింస, సత్యాగ్రహంతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
దేశం కోసం గాంధీ తన జీవితాన్నే త్యాగం చేశారని... మహాత్ముడి వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. సత్యానిదే అంతిమ విజయమని గాంధీ జీవితం చాటి చెప్పిందని తెలిపారు.
- ఇదీ చూడండి : మహాత్ముడి వర్ధంతి: సత్యాగ్రహ నినాదం- నిశ్శబ్ద పోరాటం