CM KCR Mumbai Tour: మహారాష్ట్ర సీఎం నివాసంలో ఉద్ధవ్ ఠాక్రే, కేసీఆర్ ప్రత్యేక సమావేశం ముగిసింది. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎంలు కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్, బీబీ పాటిల్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు.

భవిష్యత్ కార్యాచరణపై చర్చ
మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముంబయి వెళ్లారు. ఠాక్రే నివాసంలో ఇరువురు సీఎంలు లంచ్ చేశారు. భోజనం అనంతరం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

శరద్‌పవార్‌తోనూ కేసీఆర్ భేటీ
అనంతరం సిల్వర్ ఓక్ ఎస్టేట్‌కు వెళ్లి... ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తో కేసీఆర్ భేటీ అవుతారు. దేశంలో పరిస్థితులు, కేంద్రంలోని భాజపా సర్కార్ విధానాలు, రాజకీయస్థితిగతులు, భవిష్యత్ కార్యాచరణ సహా పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చిస్తారు. రాత్రికి హైదరాబాద్..... తిరుగుపయనం అవుతారు.
ఇదీ చదవండి : ముంబయిలో కేసీఆర్.. మహారాష్ట్ర సీఎంతో లంచ్ భేటీ..